Begin typing your search above and press return to search.

కరోనా వేళ ఈ వాహనాల్లో ప్రయాణిస్తే ముప్పే!

By:  Tupaki Desk   |   10 Jun 2021 12:30 PM GMT
కరోనా వేళ ఈ వాహనాల్లో ప్రయాణిస్తే ముప్పే!
X
రెండో దశలో విశ్వరూపం చూపిన కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసులను బట్టి లాక్ డౌన్, కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కాగా అన్ లాక్ ప్రక్రియ జరుగుతుండడం వల్ల జనాలు మళ్లీ రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ విపత్కర కాలంలో సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తేనే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తే ముప్పు కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు.

ఏయే వాహనాల్లో వైరస్ సోకే ప్రమాదం ఎంత ఉంది అనే అంశంపై జాన్ హాప్ కీన్స్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. ఆటోలో ప్రయాణం చేసే వారికి ముప్పు కాస్త తక్కువేనని పరిశోధకులు తేల్చారు. వారిలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం తక్కువ అని నిర్ధారించారు. బస్సులో దీనికంటే ఎక్కువ ప్రమాదం ఉందని తెలిపారు.

దాదాపు 40 మంది ప్రయాణించే బస్సులో వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ఉండడం వల్ల ప్రమాదమేనని చెబుతున్నారు. ఆటోతో పోల్చితే బస్సులో వైరస్ సోకే అవకాశాలు 72 శాతం అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ముప్పు కార్లలో మరింత తీవ్రంగా ఉందని చెప్పారు.

నాన్ ఏసీ కార్లలో వైరస్ సోకే అవకాశం 86 రెట్లు ఉందని అంచనా వేశారు. ఏసీ కార్లలో 300 రెట్లు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా పబ్లిక్ వాహనాల్లో కన్నా సొంత వాహనాల్లో ప్రయాణం చేయడం శ్రేయస్కారమని సూచిస్తున్నారు. గాలి, వెలుతురు ఎక్కువగా ఉండే వాహనాల్లో వైరస్ సోకే ముప్పు కాస్త తక్కువేనని వెల్లడించారు. కాబట్టి వీలైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. అనవసరంగా ముప్పును కొనితెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.