Begin typing your search above and press return to search.
ఏపీ రెడ్లకు - తెలంగాణ రెడ్లకు ఏంటి తేడా?
By: Tupaki Desk | 19 Jun 2019 6:43 AM GMTతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత - ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్డి సామాజికవర్గం మాదిరి తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా సక్సెస్ కావడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో - ఇప్పుడు కూడా రాయలసీమ రెడ్లు రాజకీయంగా సక్సెస్ అయ్యారని.. కానీ, తెలంగాణ రెడ్లు రాజకీయంగా వెనుకబడ్డారని అన్నారు. ఇది చాలామంది నుంచి వినిపిస్తున్నమాటే అయినప్పటికీ రాజనర్సింహ నోటి నుంచి రావడంతో రాజకీయంగా అందరిలో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ రెడ్డి సామాజికవర్గ నేతల్లో ఆ అధికారేచ్ఛను రగిలించి కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైనవర్గంగా ఎదిగేలా చేయాలనే ప్రయత్నమా.. లేదంటే బీజేపీ వైపు చూస్తున్న తమ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతల వల్ల లాభం లేదని బీజేపీకి సంకేతాలు పంపే ప్రయత్నమా అన్నది తెలియాల్సి ఉంది.
కాగా అధిష్ఠానం తనకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తే తీసుకుంటానని.. తాను అందుకు సమర్థుడినేనని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడాలంటే అధిష్ఠానం ఆలోచనావిధానం మారాలన్నారు. టీఆరెస్ ను ఫ్రెండ్లీ పార్టీగా భావించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఇంతగా నష్టపోయందన్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తీరు చూసి తెలంగాణ కాంగ్రెస్ నేర్చుకోవాలన్నారు. ప్రజాసమస్యలపై పోరాడడం.. ప్రజా ఉద్యమాలు నిర్మించడం చేయకపోతే విఫలం కాకతప్పదన్నారు.
అలాగే.. తెలంగాణకు చెందిన ఎంపీ కిషన్ రెడ్డిని కేంద్ర హొంశాఖ సహాయ మంత్రిని చేయడం ద్వారా బీజేపీ టీఆరెస్ కు హెచ్చరికలు పంపించిందని రాజనర్సింహ అన్నారు. తమ పార్టీ పరిస్థితికి బాధపడుతూనే ఆయన టీఆరెస్ ను బీజేపీ టార్గెట్ చేయడాన్ని లోలోపల హర్షించినట్లుగానే ఆయన మాట్లాడారు.
కాగా దామోదర రాజనర్సింహ దళిత నేత అయినప్పటికీ ఆయన భార్య రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. బీజేపీ చర్యను ఆయన హర్షించడం.. జగన్‌ను చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలనడం.. తెలంగాణ రెడ్లకు ఏపీ రెడ్లకు తేడా చెప్పడం చూస్తుంటే ఆయన కూడా బీజేపీ వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.