Begin typing your search above and press return to search.
జనసేన గూటికి వైసీపీ పెద్దాయన...?
By: Tupaki Desk | 10 April 2023 9:00 PM GMTఏపీలో జనసేనకు కూడా ఎన్నికల వేళ డిమాండ్ వచ్చేలా కనిపిస్తోంది. అటు టీడీపీలోకి వెళ్ళలేని వారు రెండవ ఆప్షన్ గా జనసేనను ఎంచుకుంటున్నారని అంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం. ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీని ఘాటుగా విమర్శించాలి. అయితే కొంతమంది ఇంకా హార్ష్ గా కామెంట్స్ చేస్తారు. మరి కొందరు ఏకంగా అధినాయకత్వం పోకడల మీదనే మండిపోతూంటారు.
అలాంటివారు తాము ఉన్న పార్టీలో ఇబ్బందిగా ఉన్నపుడు సహజంగా ఎదురుగా ఉండే పార్టీలోకి వెళ్ళిపోలేరు. అప్పటిదాకా ప్రత్యర్ధుల కంటే ఎక్కువగా ఆ పార్టీని చూసి చేసిన హాట్ కామెంట్స్ ఈ రకమైన పరిస్థితిని తెస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి రాజకీయంగా కీలకమైనది. అనకాపల్లి రాజకీయ రాజధాని అని అంటారు.
అలాంటి చోట ఎంతో మంది దిగ్గజ నాయకులు అవతరించారు. తమదైన రాజకీయం చేస్తూ వచ్చారు. అలాంటి వారిలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీయార్ డిస్కవరీగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకరు అని చెప్పుకోవచ్చు. దాడి వీరభద్రరావు హిందీ అధ్యాపకుడిగా ఉంటున్న వేళ ఎన్టీయార్ ఆయన్ని ఆహ్వానించి మరీ టికెట్ ఇచ్చారు.అలా అన్నగారి చలవతో అయిదు మార్లు ఎమ్మెల్యేగా కీలకమైన మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు దాడి.
ఆయనను రాజకీయ మేధావిగా పేర్కొంటారు.స్వతహాగా అధ్యాపకుడు సాహితీకారుడు అయిన దాడి స్మూత్ గానే పాలిటిక్స్ చేస్తారు అని పేరు. పెద్ద మనిషిగా ఉంటారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్టీయార్ హయాంలో పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గంలో ఉండేవారు. ఇక చిన్నల్లుడు చంద్రబాబు వర్గంలో మొదటి నుంచి అయ్యన్నపాత్రుడు ఉండేవారు. ఇద్దరూ మంత్రులుగా ఉన్న్నా సయోధ్య ఉండేది కాదు.
ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన వేళ అన్నగారితోనే దాడి ఉంటూ తన నైతికతను చాటుకున్నారు. అన్నగారు పోయిన తరువాత ఆయన మరో మార్గం లేక చంద్రబాబు వైపు వచ్చారు. అయితే మొదటి నుంచి బాబు వర్గంలో ఉన్న అయ్యన్న కారణంగా దాడికి అక్కడ అనుకున్న ప్రయారిటీ లభించలేదు. మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిగా మాత్రం తరువాత కాలంలో కాలేకపోయారు.
ఇక 2004లో దాడి తొలిసారి ఓటమి పాలు అయ్యారు. అయితే 2007లో శాసనమండలి పునరుద్ధరణతో ఆయనకు మరో చాన్స్ వచ్చింది. లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్యేగా ఆయన నెగ్గారు. చంద్రబాబు ఆయన్ని శాసనమండలిలో విపక్ష నేతగా నియమించారు. అలా ఆయన 2013 దాకా కొనసాగారు. ఆ తరువాత రెన్యూల్ లేకపోవడంతో ఆయన బాబుతో విభేదించి వైసీపీలో చేరారు. అలా తన కుమరుడు రత్నాకర్ కి టికెట్ ఇప్పించుకున్నారు. వైసీపీ ఆ ఎన్నికల్లో ఓడింది. రత్నాకర్ కూడా ఓడారు. అయిదేళ్ల పాటు టీడీపీలో ఉంటే ఆయనకు కలసివచ్చేదేమో కానీ ఆయన వైసీపీని జగన్ని విమర్శిస్తూ దూరం జరిగారు. మళ్లీ టీడీపీకి చేరువ అయ్యారు.
అయితే టీడీపీలో అవకాశం లేకపోవడంతో 2019 ఎన్నికల ముందర మళ్లీ వైసీపీలో చేరారు. కానీ టికెట్ మాత్రం దక్కలేదు. 2024లో టికెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదని అంటున్నారు. అక్కడ యువ మంత్రి గుడివాడ అమరనాధ్ పాగా వేశారు. ఆయనకే మళ్లీ జగన్ టికెట్ ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో దాడికి టీడీపీలో అవకాశాలు లేవు అని అర్ధం అయిపోతోంది. అందుకే జనసేనలోకి వెళ్లడం బెస్ట్ ఆప్షన్ గా ఉందని అంటున్నారు.
జనసేనలోకి వెళ్ళి పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు తెచ్చుకుంటే కుమారుడు దాడి రత్నాకర్ ఎమ్మెల్యే అవుతారు అన్నది పెద్దాయన ఆలోచనట. అయితే 2018లో దాడి ఇంటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి తన పార్టీలో చేరమని కోరారు. నాడు దాడి ఏమీ చెప్ప్లేదని అంటున్నారు. ఆయన చూపు నాడు వైసీపీ మీద ఉంది అని చెబుతారు. అయితే ఇపుడు దాడి తన రాజకీయ అవసరాల కోసం జనసేనలో చేరితే చేర్చుకుంటారు కానీ పొత్తులలో భాగంగా టికెట్ ఇస్తారా అన్నది చూడాలని అంటున్నారు.
ఇక చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేసిన దాడికి పొత్తు కోసం టికెట్ వదిలేసేటంత ఔదార్యం టీడీపీ పెద్దలకు ఉంటుందా అని మరో సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా దాడి జనసేనలోకి జంప్ అవుతారు అన్న ప్రచారం మాత్రం సాగుతోంది. ఇందులో నిజానిజాలు ఏంటో చూడాల్సి ఉంది.