Begin typing your search above and press return to search.
నేడు టీఆర్ ఎస్ కు డీఎస్ రాజీనామా..!
By: Tupaki Desk | 4 Sep 2018 5:14 AM GMTతెలంగాణ రాజకీయాల్లో తలపండిన నేత డీ. శ్రీనివాస్ టీఆర్ ఎస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ చీఫ్ గా చేసి కాంగ్రెస్ ను వైఎస్ తో కలిసి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత డీఎస్ ది. వైఎస్ కేబినెట్ లో మంత్రిగాను ఆయన పనిచేశారు. తెలంగాణ వచ్చాక టీఆర్ ఎస్ లో చేరిన డీఎస్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. కొడుకుల వల్ల అటు వాళ్లను కదనలేక.. ఇటు టీఆర్ ఎస్ వ్యతిరేక ముద్ర పడడంతో ఆ పార్టీలో ఇమడలేకపోయారు.. ఎన్నో ఫిర్యాదులు - ఎన్నో విమర్శల నడుమ నేడు రాజీనామా చేసి టీఆర్ ఎస్ ను వీడుతున్నట్లు తెలిసింది..
డీఎస్ రాజీనామాకు ప్రధాన కారణం ఆయన కుమారుడిని లైంగిక వేధింపుల ఆరోపణలపై టీఆర్ ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించడమే..పార్టీ తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తోందని డీఎస్ గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాదు.. డీఎస్ రెండో కుమారుడు అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎంపీ కవితను ఓడించేందుకు భారీ స్కెచ్చులు వేస్తున్నారు. రెండో కొడుకు సీఎం కేసీఆర్ కూతురునే ఢీకొనేలా రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలోనే టీఆర్ ఎస్ పార్టీ తనను - తన ఫ్యామిలీని టార్గెట్ చేసిందని డీఎస్ బలంగా నమ్ముతున్నారు.
ఇవేకాకుండా నిజామాబాద్ లో డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై కిందిస్థాయి నేతలు ఫిర్యాదు చేశారు.ఆ మధ్య ఎంపీ కవిత ఆధ్వర్యంలో సమావేశమై డీఎస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేసి కేసీఆర్ కు పంపారు.
వీటన్నింటి పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల డీఎస్ కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ వచ్చారు. కానీ సీఎం కేసీఆర్ అక్కడే ఉండి కూడా మీటింగ్ లలో బిజీగా ఉన్నాడంటూ దాదాపు కొన్ని గంటల పాటు ఆయన్ను ఎదురుచూసేలా చేశారు. ఇక కేసీఆర్ తనను కలిసే ఉద్దేశం లేదని నిర్ణయించుకున్న డీఎస్ ఎట్టకేలకు టీఆర్ ఎస్ కు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు.
టీఆర్ ఎస్ కు డీఎస్ రాజీనామా చేస్తుండడంతో ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతాడనేది ఆసక్తిగా మారింది. పూర్వపు కాంగ్రెస్ పార్టీలోకే ఆయన వెళ్లే చాన్స్ ఉంది.