Begin typing your search above and press return to search.

పరాజయలపై సీడబ్ల్యూసీ సమీక్షా ? కోలుకునే అవకాశముందా ?

By:  Tupaki Desk   |   10 May 2021 6:30 AM GMT
పరాజయలపై సీడబ్ల్యూసీ సమీక్షా ? కోలుకునే అవకాశముందా ?
X
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణలను కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందట. ఇందుకోసం పార్టీ అత్యున్నత వేదిక కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సీడబ్ల్యూసీ) సోమవారం సమావేశమవుతోంది. ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై నిజానికి ప్రత్యేకంగా సమీక్షంటు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఓటమికి కారణాలు కళ్ళెదుటే కనబడుతోంది. పార్టీని పట్టి పీడిస్తున్న నాయకత్వ లోపమే అసలైన సమస్య. సోనియాగాంధికి అనారోగ్యం. రాహూల్ గాంధికి పార్టీని గెలిపించుకోవాలనే కసి లేకపోవటం. ప్రియాంకగాంధికి పార్టీ విజయం పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవటం.

పై కారణాలకు తోడు పార్టీలో వృద్ధనేతల ఆధిపత్యం, కోటరీ, మాఫియా పెరిగిపోవటం. పార్టీ, అధికార పదవుల నుండి వృద్ధనేతలు పక్కకు తప్పుకోరు. తమ స్ధానాల్లో యువ, కొత్తనేతకు అవకాశం ఇవ్వటాన్ని వీళ్ళ సహించలేకపోతున్నారు. పోనీ వీళ్ళేమైనా రాష్ట్రాల్లో పర్యటించి పార్టీకి జవసత్వాలను నింపగలుగుతున్నారా అంటే అదీలేదు. అంటే వీళ్ళు తప్పుకోరు కొత్తనాయకత్వాన్ని ఎదగనీయరు. సోనియా కూడా వీళ్ళ హస్తాల్లో ఇరుక్కుపోవటం వల్లే రాహూల్ ఆలోచనలు, నిర్ణయాలు అమలు కావటంలేదు.

మొన్ననే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహూల్ కేరళ, తమిళనాడులో ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. ప్రయాంకగాంధి అస్సాంలో మాత్రమే ప్రచారం చేశారు. పశ్చిమబెంగాల్లో రాహూల్ ప్రచారం చేయాలనుకునే సమయానికి కరోనా తీవ్రత పెరిగిపోవటంతో పర్యటన రద్దు చేసుకున్నారు. ఎలాగూ సోనియా అనారోగ్యంతోనే ఉన్నారు కాబట్టి ఆమె ఎన్నికల పర్యటనకు అవకాశమే లేదు. మరి వృద్ధనేతలందరు ఏమి చేస్తున్నట్లు ?

దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, అశోక్ గెహ్లాత్, కమల్ నాద్ లాంటి అనేకమంది సీనియర్లు ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. బెంగాల్, తమిళనాడులో కాంగ్రెస్ అధికారానికి దూరమై దశాబ్దాలైపోయింది. వివిధ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కసి పార్టీ నేతల్లోనే కనిపించటంలేదు. ఈమధ్యనే ఎన్నికలు జరిగిన బీహార్ లో రాహూల్, ప్రియాంకతో పాటు సీనియర్ నేతల్లో చాలామంది అసలు ప్రచారమే చేయలేదు. దాంతో కాంగ్రెస్ అభ్యర్ధులకు కూడా ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవే ప్రచారం చేయాల్సొచ్చింది.

వర్గ విభేదాలతో అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పోగొట్టుకున్నారు. నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు రాహూల్ ఏ దశలోను ప్రయత్నాలు చేసినట్లు లేదు. పార్టీపైన సోనియా కుటుంబంతో పాటు సీనియర్ నేతలకే ఇంట్రస్టు లేనపుడు జనాలు మాత్రం ఎందుకు ఓట్లేస్తారు ? బలమైన నరేంద్రమోడికి ధీటుగా ప్రత్యర్ధిగా ఎదగాలనే కసి రాహూల్లో ఏ దశలోను కనిపించటంలేదు. మామూలు జనాలకు పార్టీపై ఉన్న ప్రేమ, శ్రద్ధ కూడా సొంతనేతలకు లేకపోవటమే అసలైన మైనస్. ఇదే పార్టీ ఓటమికి కారణాలని జనాలే చెప్పుకుంటున్నారు. మరి సీడబ్ల్యూసీ సమావేశం ఏమి తేలుస్తుందో చూద్దాం.