Begin typing your search above and press return to search.
ఏపీలో మున్సిపాలిటీలకు 'కరెంట' షాక్
By: Tupaki Desk | 15 Sep 2021 4:30 AM GMTవిద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలో సామాన్యులు ఒకలా? ప్రభుత్వ సంస్థలు మరోలా వ్యవహరిస్తున్నారు. రెండు నెలల బిల్ పెండింగ్ ఉంటేనే మన ఇంటికి కరెంట్ కట్ చేసే అధికారులు ప్రభుత్వ సంస్థలు కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నా కూడా స్పందించిన పాపాన పోరు.
కానీ ఎంతకని విద్యుత్ బకాయిలు విద్యుత్ సంస్థ భరిస్తుంది.. విసిగి వేసారి తాజాగా కట్ చేసి పడేసింది. అనంతపురం జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సంచలనమైంది.
గుత్తి , పామిడి, పెనుకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర , మున్సిపాలిటీలకు, ఖణెకల్లు పంచాయతీకి కరెంట్ కట్ చేశారు.
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కు, 11 మున్సిపాలిటీలు రూ.163 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అందుకే కరెంట్ సరఫరాను నిలిపివేశామని చెప్పారు.
మొత్తంగా ప్రభుత్వ సంస్థలకు పోము అన్న అపవాదును విద్యుత్ అధికారులు పక్కనపెట్టి కోట్ల రూపాయల వసూళ్లకు కదిలి 'కరెంట్' షాక్ ఇచ్చేశారు.