Begin typing your search above and press return to search.
తెలంగాణను చుట్టే స్తున్న క్రిప్టో మోసాలు.. జాగ్రత్త గురూ!
By: Tupaki Desk | 9 Feb 2022 1:30 AM GMTక్రిప్టో మోసాలు.. ఈ మాట నిన్న మొన్నటి వరకు ధనికుల వరకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే.. ఇప్పుడు తెలంగాణ వరకు ఈ మోసాలు పాకాయి. కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టండి.. భారీ మొత్తంలో లాభాలు అందుకోండి! అనే నినాదంతో సాగుతున్న మోసాల్లో చిక్కుకుని.. పేదలు.. మధ్య తరగతి వారు.. ఉన్నది కూడా పోగొట్టుకుని..రోడ్డున పడుతున్నారు. లాభం వస్తే.. సరే.. లేకపోతే.. ఉన్నది కూడా ఊడ్చుకుపోయి.. ఎవరిని అడగాలో కూడా తెలియక లబోదిబోమనే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ మోసాలు.. తెలంగాణ పల్లెల వరకు విస్తరించడమే తీవ్ర ఆందోళన కర అంశంగా మారింది.
ఖమ్మం నగరంలో ఇండోల్‌కాయిన్, ట్రస్ట్ వ్యాలెట్-యూకే పేర్లతో క్రిప్టో కరెన్సీ చైన్ స్కీములకు సంబంధించిన బుక్‌లెట్లు, కరపత్రాలు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. బిట్‌కాయిన్, ఇథేరియమ్, ట్రాన్ పేర్లతో ఉన్న క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఒకరిద్దరిని చేర్పిస్తే.. బేసిక్ సభ్యత్వం..ఆ ఇద్దరు మరో ఇద్దరేసి వ్యక్తులను చేర్పిస్తే.. మొదటి వ్యక్తికి స్టాండర్డ్ సభ్యత్వం.. ఇలా అడ్వాన్స్‌డ్, ప్రీమియం, క్రౌన్, కోర్, ప్లాటినం పేర్లతో సీనియారిటీ పెరుగుతుందని నమ్మబలుకు తున్నారు. పెట్టుబడి డాలర్ల రూపంలో ఉంటుందని చెబుతూ. 50 నుంచి 10 వేల అమెరికా డాలర్లు పెట్టవచ్చని ముగ్గులోకి దింపుతున్నారు.
100 డాలర్ల(సుమారు రూ.7,500) పెట్టుబడి పెట్టినవారికి రోజుకు 1 డాలర్(సుమారు రూ.75), 10వేల డాలర్లు(రూ. 7.5 లక్షలు) పెట్టిన వారికి రోజుకు 100 డాలర్లు (రూ. ,500), నెలకు రూ. 2.25 లక్షల మేర లాభం వస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత నిర్వాహకులు యాప్‌ను ఎత్తేస్తున్నారు. ఇలా ఇప్పటికే ట్రస్ట్ వ్యాలెట్-యూకే అనే క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.
చేర్పించిన వారికే తిప్పలు!
ఫేక్ వ్యాలెట్ యాప్‌లలో పెట్టుబడి పెడుతున్న వారి లాభాలు కేవలం యాప్‌లోనే కనిపిస్తాయి. వాటిని విత్‌డ్రా చేసుకునే అవకాశమే ఉండదు. ఏపీలోని విజయవాడ, నందిగామ, గుడివాడ.. తెలంగాణలోని ఖమ్మం, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వేల మంది బాధితులు మోసపోయినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. సైబర్ మోసగాళ్లు బోర్డు తిప్పేశాక.. బాధితులు చేసేది లేక, తమను ఈ స్కీముల్లో చేర్పించిన వారిని నిలదీస్తున్నారు.
పోలీసులు ఏమంటున్నారంటే..
ఆయా యాప్‌లలో పెట్టే పెట్టుబడులన్నీ.. ఆయా దేశాల్లోని కేటుగాళ్ల ఖాతాలకు చేరుతాయి. ఈ పరిస్థితుల్లో బాధితులు పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రికవరీ చేయడం కష్టమేనని పోలీసులు చెబుతున్నారు. ఖమ్మంలో క్రిప్టో కరెన్సీ ఫేక్ వ్యాలెట్ల బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ కేసు నమోదవ్వగా.. 400 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు దారితీసిన ఉదంతం
ఖమ్మం నగరానికి చెందిన గుడిమెడ రామలింగస్వామి క్రిప్టోకరెన్సీ సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. క్రిప్టో చైన్‌స్కీమ్‌లో లాభాలొస్తాయని కేటుగాళ్లు చెప్పడంతో.. పోగేసుకున్నదంతా పెట్టుబడిగా పెట్టారు. వర్చువల్ ఐడీలు రావడం.. యాప్‌లో తన పెట్టుబడికి లాభాలు వస్తున్నట్లు కనిపించడంతో చైన్‌స్కీమ్‌ను ఇతరులకూ పరిచయం చేశారు. చివరకు కేటుగాళ్లు ఆ వ్యాలెట్ యాప్‌ను ఎత్తేశారు. పెట్టుబడి పెట్టినవారి నుంచి రామలింగస్వామిపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన గత ఏడాది నవంబరు 24న ఆత్మహత్యకు పాల్పడ్డారు. సో.. క్రిప్టో పేరిట జరుగుతున్న మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.