Begin typing your search above and press return to search.

రాంగ్ సిగ్న‌ల్ వ‌ల్లే.. ఒడిశా రైలు ప్ర‌మాదం: వెల్ల‌డించిన నివేదిక‌!

By:  Tupaki Desk   |   4 July 2023 9:30 AM GMT
రాంగ్ సిగ్న‌ల్ వ‌ల్లే.. ఒడిశా రైలు ప్ర‌మాదం: వెల్ల‌డించిన నివేదిక‌!
X
ఏకంగా 292 మంది అమాయ‌క ప్ర‌యాణికుల ప్రాణాలు పోవ‌డానికి 1000 మందికిపైగా గాయ‌ప‌డడానికి కార‌ణ‌మైన ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న దేశాన్ని మొత్తం కుదిపేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌మాదానికికార‌ణం.. కేవ‌లం రాంగ్ సిగ్న‌లే కార‌ణ‌మ‌ని.. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టిన‌.. రైల్వే భ‌ద్ర‌తా క‌మిష‌న్‌(సీఎస్ ఆర్‌) స్ప‌ష్టం చేసింది. జూన్ 2న జ‌రిగిన ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణ రైల్వే బోర్డు.. సీఎస్ ఆర్‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే.

సుదీర్ఘ విచార‌ణ చేసిన సీఎస్ ఆర్‌.. రైలు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను పేర్కొంది. రాంగ్‌ సిగ్నలింగ్‌ వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకుందని, అదేవిధంగా అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించామ‌ని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. ప్ర‌ధానంగా.. సిగ్నలింగ్‌, సర్క్యూట్‌ మార్పులో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని బోర్డు తేల్చి చెప్పింది.

పాఠాలు నేర్చుకుని ఉంటే..

ప్ర‌పంచంలోని అతి పెద్ద వ్య‌వ‌స్థ‌ల్లో భార‌తీయ‌ రైల్వే ఒక‌టి. దీంతో ఎక్క‌డ ఏం జ‌రిగినా.. దాని ప‌ర్య‌వ‌సా నం.. స‌హా ఫ‌లితాల‌ను ఈ శాఖ దాచి.. త‌ద‌నంత‌రం అలాంటివి జ‌ర‌గ‌కుండా చూసుకుంటుంది. కానీ, ఇటీవ‌ల కాలంలో ఇలాంటి పాఠాలు నేర్చుకోవ‌డం లేదని క‌మిష‌న్ త‌ప్పుబ‌ట్టింది. ఒడిశాలోని బ‌హ‌న‌గా రైల్వే స్టేష‌న్లో చోటు చేసుకున్న ఘ‌ట‌న లాంటిదే.. 2022, మే 16న ఖ‌ర‌గ్‌పూర్‌లోనూ జ‌రిగిన‌ట్టు తెలిపింది.

అప్ప‌టి ఘోరం తాలూకు పాఠాల‌ను నేర్చుకుని.. స‌రిదిద్దుకుని ఉంటే.. ఇప్పుడు ఈ ఘోరం జ‌రిగి ఉండేది కాద‌ని తెలిపింది. రాంగ్‌ వైరింగ్‌, రాంగ్‌ కేబుల్‌ వల్ల ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో ప్ర‌మాదం జ‌రిగింద‌ని నివేదిక తెలిపింది. అప్పుడే దాన్ని సరిచేసే చర్యలు చేపట్టి రాంగ్‌ వైరింగ్‌ సమస్యను పరిష్కరించిఉంటే ఒడిశా దుర్ఘటన చోటుచేసుకొని ఉండేది కాదు.. అని సీఎస్ ఆర్ త‌న నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది.