Begin typing your search above and press return to search.

యోగులు సీఎం అవ్వడమా? యూపీ సీఎంపై సాధువు ఫైర్

By:  Tupaki Desk   |   25 Jan 2022 3:54 PM GMT
యోగులు సీఎం అవ్వడమా? యూపీ సీఎంపై సాధువు ఫైర్
X
యోగి ఎప్పుడు అవుతారు? భవ బంధాలన్నీ వదలుకొని.. ఇక తమకు ఏ ఆశ లేదని దేవుడి ధ్యాసలో ఉన్న వారిని యోగిగా పరిగణిస్తారు. వారికి దేవుడి సేవ, ప్రవచణాలు చెప్పడం తప్ప మరొకటి ఉండదు. అయితే యోగిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీజేపీదే..

యోగులు ముఖ్యమంత్రులు అవ్వడం ఏంటని ఉత్తరప్రదేశ్ కు చెందిన సాధువు స్వామి అవిముక్తేశ్వరానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ యోగీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతూనే ఉంది.

సెక్యూలరిజం ప్రకారం పాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఒక మత విశ్వాసానికి ఎలా కట్టుబడి ఉంటారని అవిముక్తేశ్వరానంద సోమవారం ప్రశ్నించారు. రెండు వాగ్ధానాలపై ఏ వ్యక్తి నిలబడలేడన్నారు.

ఒక యోగి ఇప్పటికే మహంత్ గా ఉండొచ్చు కానీ.. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అవ్వకూడదు. ఇలాంటివి ‘ఖలీఫత్’ సిద్ధాంతంలోనే ఉంటాయని విమర్శించారు. ఒక ఇస్లామీ ప్రవక్త, పాలనాధికారి అయ్యేది ఖలీఫత్ ద్వారానే’ అని విమర్శించారు.

యూపీ సీఎం యోగి ఇప్పటికే గోరఖ్ పూర్ మందరిలో మహంతిగా ఉన్నారు. అనంతరం ఎంపీగా పోటీచేసి గెలిచారు. లక్కీగా యూపీ సీఎంగా ఎంపికై ఐదేళ్లుగా చేస్తున్నారు.