Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఎన్నికల్లో గూండాలు
By: Tupaki Desk | 28 Jan 2016 9:44 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితుల సంఖ్య భారీగా ఉంది. గ్రేటర్ అభ్యర్తులపై ఉన్న కేసుల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ విడుదల చేసింది. మొత్తం 72 మంది నేరస్తులు బరిలో ఉన్నట్లు తేల్చింది. వారిలో 64 మంది పురుషులు కాగా… ఎనిమిది మంది మహిళా నేరస్తులున్నారు.
ఇక అభ్యర్థుల్లో నేరచరితులను పార్టీల వారీగా చూస్తే టీఆర్ ఎస్ నుంచి 14 మంది నేరస్తులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 13 మంది - కాంగ్రెస్ నుంచి 13 మంది నేరస్తులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి 4 - ఎంఐఎం నుంచి 11 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. 11 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులపైనా క్రిమినల్ కేసులున్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది. సీపీఎం - సీపీఐ నుంచి కూడా ఒక్కో నేరస్తుడు పోటీ చేస్తున్నారు.
మొత్తం మీద నేరస్తులను బరిలో దింపడంలో టీడీపీ - టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ముందు వరుసలో ఉండగా అధికార పార్టీ టీఆరెస్ అందరి కంటే అధికంగా 14 మంది క్రిమినల్స్ ను బరిలో దించింది. వీరంతా కనుక ఎన్నికైతే జీహెచ్ ఎంసీలో గూండారాజ్యం తప్పదని ప్రజలు అనుకుంటున్నారు.