Begin typing your search above and press return to search.

అమెరికాలో కోవిడ్ మరణాలు.. రెండో ప్రపంచ యుద్ధం కన్నా ఎక్కువట !!

By:  Tupaki Desk   |   17 May 2022 2:49 AM GMT
అమెరికాలో కోవిడ్ మరణాలు.. రెండో ప్రపంచ యుద్ధం కన్నా ఎక్కువట !!
X
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అమెరికా అంతర్యుద్ధంలోను, రెండో ప్రపంచ యుద్ధంలోను చనిపోయిన అమెరికన్ల సంఖ్యకన్నా ఈ సంఖ్య కాస్త ఎక్కువేనట. అసలు అమెరికాలో కోవిడ్ మరణాలు ఇన్ని లక్షలున్నాయంటేనే ప్రపంచం నమ్మటం లేదు.

ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అమెరికా అగ్రరాజ్యమని, తమ దగ్గర ఉన్న అత్యాధునిక సౌకర్యాలు, వసతులు, సాంకేతిక పరిజ్ఞానం మరేదేశంలోను లేదని చెప్పుకుంటుంటుంది. ఇలాంటి అమెరికాలోనే కోవిడ్ కారణంగానే 10 లక్షల మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు.

దేశంలో కోవిడ్ వల్ల చనిపోయిన ప్రతి నలుగురిలో ముగ్గురు 65 ఏళ్ళు దాటిన వారే అని వ్యాధి నియంత్రణ కేంద్రం చెప్పింది. చనిపోయిన వారిలో మగవాళ్ళు, శ్వేతజాతీయులు పైగా నగరాలు, పట్టణాల్లో అత్యధికమని చెప్పింది.

అంటే రోగులు, చనిపోయిన వారిలో కూడా అమెరికా నల్లజాతివారా ? తెల్లజాతివారా అని చూస్తోందనే విషయం ప్రపంచానికి అర్థమైంది. ఇక్కడ విషయం ఏమిటంటే పది లక్షల మంది చనిపోయినట్లు అధికారికంగా చెప్పినా వాస్తవానికి చనిపోయిన వారి సంఖ్య అంతకు మించి చాలా ఎక్కువగానే ఉందని సమాచారం. 2021 జనవరిలో రోజుకు 3400 మంది చనిపోయారు. తర్వాత, ఇపుడు కూడా రోజుకు సగటున 300 మంది చనిపోతున్నారు. అలాంటపుడు పదిలక్షల మందే చనిపోయారని చెప్పిన లెక్క తప్పని ఒక అంచనా.

అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే కోవిడ్ టీకాలు వేసుకోకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు. టీకాలు వేసుకుంటే పిల్లలు పుట్టరనే ప్రచారం బాగా పెరిగిపోయింది. దాంతో చాలామంది టీకాలు వేసుకోవటానికి యువత, మధ్య వయసు వాళ్ళు అస్సలు ఇష్టపడలేదు. టీకాలు వేసుకోని వాళ్ళు, భయంతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నట్లు కేంద్రం అధికారులు చెప్పారు.

టీకాలు వేసుకున్న వారికన్నా టీకాలు వేసుకోని వారిలో మరణాలు ఎక్కువగా ఉందని అధికారులు ఎంతగా మొత్తుకున్నా టీకాలు వేసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతో టీకాలను బలవంతంగా వేయలేక ప్రభుత్వం కూడా చోద్యం చూస్తోంది.