Begin typing your search above and press return to search.

కేంద్ర బ‌డ్జెట్ లీక్‌.. మ‌ళ్లీ మొద‌టికి.. పోల‌వ‌రంపై మ‌డ‌త పేచీ.. చేసిన పాపం వెంటాడుతోందా?

By:  Tupaki Desk   |   25 Jan 2021 5:30 AM GMT
కేంద్ర బ‌డ్జెట్ లీక్‌.. మ‌ళ్లీ మొద‌టికి.. పోల‌వ‌రంపై మ‌డ‌త పేచీ.. చేసిన పాపం వెంటాడుతోందా?
X
రాష్ట్ర జ‌ల‌ జీవ‌నాడి.. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేసింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒకింత ఫ‌ర్వాలేదులే అను కున్న ఈ ప్రాజెక్టు విష‌యంలో కేంద్ర స‌ర్కారు. మ‌ళ్లీ పాత పాటే పాడుతోంది. స‌వ‌రించిన‌.. అంచ‌నాల మేర‌కు 57 వేల కోట్ల రూపాయ ల‌ను ఇచ్చేది లేద‌ని తాజాగా మ‌రోసారి కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. గ‌తంలో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో వేసిన అంచ‌నాల మేర‌కు.. 20,398 కోట్ల రూపాయ‌ల‌ను మాత్ర‌మే ఇస్తామ‌ని ఇప్పుడు చెప్పుకొచ్చింది. వాస్త‌వానికి రెండు మాసాల కింద‌ట ఇదే విష‌యంపై ర‌గ‌డ చోటు చేసుకున్న‌ప్పుడు హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన‌.. జ‌గ‌న్‌.. పోల‌వ‌రంపై పాత అంచ‌నాల‌ను ప‌క్క‌న పెట్టి.. కొత్త‌గా ఇచ్చిన అంచ‌నాలు(చంద్ర‌బాబు హ‌యాంలోనివి) ఆమోదించాల‌ని కోరారు.

అప్ప‌ట్లో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి ఓకే చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, కేంద్ర‌ బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న లో మాత్రం పోల‌వ‌రం ప్రాజెక్టుకు పాత అంచ‌నాల‌మేర‌కే నిధులు కేటాయించిన‌ట్టు స‌మాచారం లీకైంది. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి కి కూడా పోల‌వ‌రం విష‌యాన్ని వివ‌రించారు. కొత్త అంచ‌నాల మేర‌కు నిధులు ఇవ్వాల‌ని కోరారు. అయితే.. ఈ విష‌యంలో ఏం జ‌రుగుతోందో తెలుసుకున్న కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు .. రెండు రోజుల కింద‌ట‌. బ‌డ్జెట్ కేటాయింపుల్లో పోల‌వ‌రానికి పాత అంచ‌నాల మేరకు మిగిలి ఉన్న నిధులు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ క‌స‌ర‌త్తు పూర్తి చేసింద‌ని తెలుసుకున్నారు. ఇదే విష‌యాన్ని.. వైసీపీ కీల‌క ఎంపీ.. ఢిల్లీలో చ‌క్రం తిప్పే నాయ‌కుడికి తెలిపింది.

తాజాగా ఈ విష‌యం.. ప్ర‌భుత్వానికి తెలిసింది. ఆనోటా.. ఈనోటా.. పోల‌వ‌రం విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే.. ఇది కేంద్రం త‌ప్పుకాద‌ని.. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనే అంచ‌నాలు పెంచాల‌ని ఆయ‌న లేఖ రాసి స‌వివ‌రంగా నివేదిక అందించిన‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ దీనికి విరుద్ధంగా లేఖ‌రాశార‌ని.. వాటిని ప్రాతిపదిక‌గా తీసుకునే కేంద్ర పాత అంచ‌నాల‌కు సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. ఇక‌, ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారుకు ఈ ప‌రిణామం సెగ పెట్ట‌డం ఖాయం. ఎందుకంటే.. ఈ ఏడాది డిసెంబ‌రు నాటికి ఎట్టిప‌రిస్థితిలోనూ పోల‌వ‌రం పూర్తి చేసి తీరుతామ‌ని.. మంత్రులు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత వార్షిక బ‌డ్జెట్‌లో పోల‌వ‌రానికి నిధులు కేటాయించాలంటూ.. కాళ్ల‌రిగేలా.. ఢిల్లీకి తిరిగారు. కానీ, ఫ‌లితం ఇప్పుడు చూచాయ‌గా తేలిపోవ‌డంతో పోల‌వ‌రం ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు.