Begin typing your search above and press return to search.

ఖ‌మ్మం కారు.. దారి త‌ప్పుతోందా?!

By:  Tupaki Desk   |   25 Jan 2023 9:55 AM GMT
ఖ‌మ్మం కారు.. దారి త‌ప్పుతోందా?!
X
ఔను.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఇటీవ‌ల బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ పెట్టి.. జిల్లాపై క‌న‌క వ‌ర్షం కురిపించారు. ఇక్క‌డ బ‌హిరంగ స‌భ పెట్ట‌డం ద్వారా.. పార్టీలో ఉన్న అసంతృప్తుల‌ను త‌గ్గించాల‌ని.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న‌వారిని.. వెళ్లాల‌ని అనుకుంటున్న‌వారిని కూడా లైన్‌లో పెట్టుకోవాల‌ని భావించారు. అయితే.. ఇది వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.

ఎందుకంటే.. అసంతృప్తులు.. మ‌ళ్లీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల పేరిట క‌లుస్తున్నారు. త‌మ వ్యూహాల‌ను తాము సిద్ధం చేసుకుంటున్నారు. వీరికి పోటీగా ఎమ్మెల్యేలు కూడా సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఖ‌మ్మం కారు పార్టీలో సెగ‌లు పుడుతున్నాయి. ఇటీవల మణుగూరులో పినపాక నియోజకవర్గం నేత‌లు సమ్మేళనం నిర్వహించారు. దీనికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి త‌న‌ అనుచరుల‌ను పెద్ద ఎత్తున కూడ‌గ‌ట్టారు.

ఈ క్ర‌మంలోనే తాను పార్టీ మారబోతున్నట్టు సంకేతాలిచ్చారు. ఇదిలావుంటే, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య అధ్యక్షతన ఇల్లెందు నియోజకవర్గలోనూ స‌మ్మేళ‌నం జ‌రిగింది. ఇక‌, ఈయ‌న‌కు ఏమాత్రం తీసిపోను అన్న ట్టుగా.. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మునిసిపల్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు అధ్యక్షతన మ‌రో స‌భ పెట్టుకున్నారు. దీంతో అస‌లు జిల్లాలో ఏం జ‌రుగుతోందో తెలియ‌క పార్టీ నేత‌లు ఖంగుతింటున్నారు.

మాజీ ఎంపీ పొంగులేటి తనసమ్మేళనాల్లో త‌న రాజ‌కీయ‌ పరిస్థితులను వివరించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మారేందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా చూచాయ‌గా చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌పై ధిక్కార స్వరం వినిపించారు. ఇక‌, మిగిలిన నేత‌ల స‌మ్మేళ‌నాల‌ను ప‌రిశీలిస్తే.. అవి.. వేరేగా ఉన్నాయ‌ని అంటున్నారు. కేవ‌లం వ్యూహం ప్రకారం.. పొంగులేటికి చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన స‌మావేశాలేన‌ని చెబుతున్నారు. ఏదేమైనా..ఎవ‌రి వ్యూహం ఎలా ఉన్నా.. ఖ‌మ్మంలో కారు దారిత‌ప్ప‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది ప‌రిశీల‌కుల మాట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.