ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు తొందర్లనే బ్రెయిన్ స్ట్రోక్ ఖాయం..!

Mon Mar 01 2021 10:14:46 GMT+0530 (IST)

brain stroke Symptoms

మనిషి శరీరంలో మెదడు ఎంతో కీలకమైనది. మెదడుకు  ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చాయంటే ఎదుర్కోవడం చాలా కష్టం.  బ్రెయిన్ స్ట్రోక్ అయితే ఎంతో ప్రమాదకరమైన స్థితి. మెదడులోని కొన్ని భాగాలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముందస్తుగా వచ్చే కొన్ని లక్షణాలను గుర్తిస్తే ఈ స్థితి నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేకంటే నెల ముందు మన శరీరంలోని ఎటువంటి మార్పులు జరుగుతాయో.. ఎటువంటి లక్షణాలు ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..ముఖం చేతులు కాళ్లు మొద్దుబారతాయి.. ఇది ఓ సాధారణ లక్షణమే అయితే బ్రెయిన్ స్ట్రోక్కు ముందుకూడా ఇలా జరిగే ప్రమాదం ఉంది.  తరచూ ఎక్కిళ్లు పట్టడం.. ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ ముందు కనిపించే లక్షణమని వైద్య నిపుణులు నిర్వహించిన  ఓ సర్వేలో తేలింది.కంటిచూపు మందగిస్తుంది.  తల వెనకభాగంలో ఒకొక్కసారి  నొప్పి వస్తుంది. ఒక్కోసారి స్పృహకూడా కోల్పోయే అవకాశం ఉంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం జరుగుతుంది.  మతిమరుపు బాగా పెరుగుతుంది.. ఉన్నట్టుండి పాత విషయాలు అన్ని మరిచిపోవడం.. పేర్లు మరిచిపోవడం.. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వల్లే వచ్చే ఓ మానసిక లక్షణం. వాంతులు.. వికారంగా ఉండటం అధిక రక్తపోటు కూడా బ్రెయిన్ స్ట్రోక్కు ముందు గుర్తించే ఓ సమస్య అని అంటున్నారు డాక్టర్లు. మహిళల్లో గర్భస్రావాలు కూడా జరగొచ్చని అంటున్నారు.