Begin typing your search above and press return to search.

బాడీ షేమింగ్: క్లాస్‌మేట్‌ని చంపిన బాలుడు

By:  Tupaki Desk   |   18 May 2022 12:30 PM GMT
బాడీ షేమింగ్:   క్లాస్‌మేట్‌ని చంపిన బాలుడు
X
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు తన క్లాస్ మేట్ ను హత్య చేశాడు. అయితే తనను బాడీ షేమింగ్ చేయడమే కాకుండా.. తన కుటుంబాన్ని దుర్భాషలాడడంతోనే ఈ హత్య చేసిన నిందితుడు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. అనంతరం అతడిని అబ్జర్వేషన్ హోంకు తరలించారు. నిందితుడు తన స్నేహితుడిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు సబ్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.

12వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తన క్లాస్‌మేట్‌పై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసినందుకు అతడిని హత్య చేశాడు. ఈ ఘటన శనివారం పాఠశాలలో జరిగింది. అయితే ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు తన స్నేహితుడిని "అమ్మాయి" అని పిలుస్తూ అతడి శరీరాకృతిపై కామెంట్స్ చేశాడు. పదేపదే వద్దని చెప్పినా పట్టించుకోకుండా ఆటపట్టించడం కొనసాగించాడు. బాడీ షేమింగ్ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన నిందితుడు మృతుడిని కొడవలి, కత్తితో పలుమార్లు పొడిచాడు.

కళ్లకురిచ్చి జిల్లాలోని ఓ హైవేపై ఈ నేరం జరిగింది. నిందితుడైన బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డులోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత పోలీసులు అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు.

బాలనేరస్థుడి ఈ హత్య తమిళనాడులో పెద్ద దుమారాన్ని రేపింది. అయితే ఇలాంటి విద్యార్థుల ప్రవర్తన తీరుపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో ఇటీవలి కాలంలో విద్యార్థుల మధ్య హింస, మద్యం సేవించడం, ఉపాధ్యాయులను టార్గెట్ చేయడం, తరగతిలో అనుచితంగా ప్రవర్తించడం వంటివి పెరుగుతున్నాయి.

ఈ తాజా నేరంతో తమిళనాడు ప్రభుత్వం మేల్కొని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వారిని పాఠశాలల నుంచి తొలగిస్తామని విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి అన్నారు.

సెలబ్రిటీలు బాడీ షేమింగ్ కామెంట్స్‌కి బలి కావడం మనం తరచుగా వింటుంటాం. కానీ ఇది మానసిక వ్యాధి, దీనికి చాలా అవగాహన అవసరం. లేకపోతే ిలాంటి అనర్థాలు ఎన్నో జరుగుతుంటాయి.