Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యల కలకలం

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:32 AM GMT
కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యల కలకలం
X
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన సంచలనమైంది. పొలిటికల్ గాసిప్ తరహాలో బండి మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గడిచిన జీహెచ్ఎంసీ ఎన్నికలపై బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తమ పార్టీ తమ పార్టీ ముఖ్య నేత, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయినట్టుగా బండి సంజయ్ తెలిపారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఒక ప్రతిపాదన పెట్టాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని బీజేపీకి ఇస్తామంటూ అమిత్ షా వద్ద ప్రతిపాదించారట కేసీఆర్.. అయితే ఆ ఆఫర్ కు ససేమిరా అన్నాడట’ అమిత్ షా. టీఆర్ఎస్ మద్దతు అక్కర్లేదని.. జీహెచ్ఎంసీ మేయర్ పదవి కూడా బీజేపీకి అక్కరలేదని కేసీఆర్ మొహం మీదనే అమిత్ షా చెప్పాడట.. అంతేకాదట.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని కేసీఆర్ కు స్పష్టం చేశాడట అమిత్ షా.

ఇదీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన హాట్ న్యూస్. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ తరహా పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలకు మెజార్టీ సీట్లు రాలేదు. దీంతో కేసీఆర్ వెళ్లి బీజేపీకి ఈ ఆఫర్ చేసి ఉంటారా? అన్నది చర్చనీయాంశమైంది.

ఇంతవరకు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న కేసీఆర్ ఏకంగా తలపడిన వారి వద్దకే వెళ్లి ‘మేయర్ ’ సీటు ఆఫర్ ఇచ్చాడా? అన్నది డౌట్ గా మారింది. బండి సంజయ్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాకలో గెలిచి నాగార్జున సాగర్ లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ.. హుజూరాబాద్ గెలుపుపైనే ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి బండి సంజయ్ రాజేస్తున్న మాటలు నిజమా? కావా? కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి కౌంటర్లు వస్తాయా? అన్నది వేచిచూడాలి.