Begin typing your search above and press return to search.

బాల‌య్య ఓట‌మి ఖాయం..హిందూపురంలో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   26 Aug 2018 12:24 PM GMT
బాల‌య్య ఓట‌మి ఖాయం..హిందూపురంలో క‌ల‌క‌లం
X
అనంత‌పురం జిల్లా హిందూపురంలో రాజ‌కీయ క‌ల‌క‌లం నెల‌కొంది. ఆయా పార్టీల వ్యూహ ప్ర‌తి వ్యూహాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. అధికార టీడీపీ - ప్ర‌తిప‌క్ష వైసీపీ వ్యూహ ప్ర‌తి వ్యూహాల‌తో రాజ‌కీయం హాట్ హాట్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెల‌పాలంటూ సర్వే పేరుతో జ‌నాల్లో తిరుగుతున్న 15 మందిని వైసీపీ నేత‌లు పట్టుకుని పోలీసులకు అప్పగించిడంతో వివాదం మొద‌లైంది. వారు సర్వే పేరుతో వైసీపీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని - వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే ప్యాకేజీ ఇస్తామంటూ ఎరవేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

అయితే, దీనిపై స‌ర్వే బృందంలోని వారు మ‌రో ఫిర్యాదు చేశారు. తమను అడ్డుకున్నారని - వైఎస్‌ ఆర్‌ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్‌ అనుచరులు లాడ్జి నుంచి ఆటోలలో తీసుకు వెళ్లి దాడి చేశారని సర్వేబృందం సభ్యుడు ఫిర్యాదు చేయటంతో శుక్రవారం రాత్రి పట్టణ సీఐ సూచన మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.నవీన్ నిశ్చల్‌ - వైసీపీ నాయకులు ప్రెస్ క్లబ్‌ లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లగా అప్ప‌టికే నవీన్ నిశ్చల్ మరికొందరు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొన్నామని - పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు.

మ‌రోవైపు వైఎస్‌ ఆర్‌ సీపీ సమన్వయకర్త న‌వీన్ నిశ్చ‌ల్ ఈ ప‌రిణామంపై స్పందించారు. ఓ మీడియా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేత‌లు అక్ర‌మ కేసుల‌కు తెరలేపారని ఆక్షేపించారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయమని అందుకే టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని అనంతపురం జిల్లా హిందూపురం వైయస్‌ ఆర్‌ సీపీ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్ పేర్కొంటున్నారు. సర్వే పేరుతో వైయస్‌ ఆర్‌ సీపీ నేతలకు ప్రలోభాలకు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ నేతల ఒత్తిడితో త‌న‌పై అక్రమకేసు నమోదు చేశార‌ని న‌వీన్ నిశ్చ‌ల్ తెలిపారు. సర్వే పేరుతో వైయస్‌ ఆర్‌ సీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమ‌న్నారు. టీడీపీ నేతలు కుట్రరాజకీయాలు చేస్తున్నారని, టీడీపీ నేత‌ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు.