Begin typing your search above and press return to search.
శంకుస్థాపనలో బాలయ్య హడావుడి లేదే
By: Tupaki Desk | 22 Oct 2015 4:14 AM GMTఏపీ శంకుస్థాపన కార్యక్రమంలో హడావుడికి ఏ మాత్రం కొదవ లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నీ తానై శంకుస్థాపన కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఎప్పటి మాదిరే తెర వెనుక నుంచి బాబు కుమారుడు లోకేశ్ యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్నారు.
చాలా అంశాల్లో చంద్రబాబే కీలక నిర్ణయాలు తీసుకున్నా.. వాటిల్లోలోకేశ్ ముద్ర మాత్రం కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. శంకుస్థాపన కార్యక్రమంలో ఒకటి పాత్ర ప్రముఖంగా ఉంటుందన్న అంచనా వ్యక్తమైనా.. అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనటం గమనార్హం.
ఏపీ ముఖ్యమంత్రి బావమరిదిగా.. వియ్యంకుడి హోదాతో పాటు.. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ.. శంకుస్థాపన కార్యక్రమంలో అంటీముట్టనట్లుగానే వ్యవహరించటం కనిపిస్తుంది. నిజానికి బాబుతో బాలయ్యబాబుకు ఉన్న అనుబంధంతో చూస్తే.. శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మరింత చురుకైన పాత్రను పోషించే వీలుంది.
అయినప్పటికీ.. శంకుస్థాపన కార్యక్రమంలో పరిమిత పాత్రను పోషించే దిశగా బాలయ్యబాబు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ శంకుస్థాపనకు సంబంధించి జరిగిన కార్యక్రమాల్లో.. బాలయ్య ఏ విషయంలో కలుగజేసుకోలేదని చెబుతున్నారు. ఏపీ అధికారిక ఎమ్మెల్యేల్లో తాను ఒకడిని మాత్రమేనన్నట్లుగా బాలయ్య బాబు వ్యవహరించటం వెనుక కారణమేందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.