Begin typing your search above and press return to search.

కామసూత్ర అమ్మితే దేశం పరువు పోతుందా?

By:  Tupaki Desk   |   16 Jun 2017 6:11 AM GMT
కామసూత్ర అమ్మితే దేశం పరువు పోతుందా?
X
దేశంలో హిందూత్వ సంస్థలు రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఇప్పటికే గోవు అంశం దేశవ్యాప్తంగా రచ్చరచ్చ చేస్తుండగా తాజాగా మధ్యప్రదేశ్ లోని ఖజురహో ఆలయం వద్ద కొత్త వివాదం మొదలైంది. ఖజురహో ఆలయం వద్ద కామసూత్ర పుస్తకాల విక్రయంపై భజరంగ్ సేన అనే ఓ హిందూత్వ సంస్థ తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్తోంది. ఇదిప్పుడు కొత్త వివాదమై కూర్చుంది.

నిజానికి కామసూత్ర అనేది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన భారతీయ గ్రంథం. కానీ, ఈ పుస్తకం దేశానికి చెడ్డపేరు తీసుకొస్తోందంటూ భజరంగ్ సేన గగ్గోలు పెడుతోంది. ఆ పుస్తకాల విక్రయాన్ని నిషేధించాలన్న డిమాండు మొదలుపెట్టారు. ఖజురహో చూడటానికి వచ్చే విదేశీయులు కామసూత్ర పుస్తకాలు కొంటున్నారని... ఇండియా అంటే సెక్స్ దేశమన్న ముద్ర పడుతోందని వారు కొత్త వాదన ఎత్తుకున్నారు.

నిజానికి సెక్సనేది ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితంలో ఒక భాగం. వాత్సాయనుడు రాసిన ఈ శృంగార గ్రంథం ప్రపంచమంతా పాపులర్. సెక్స్ ఎడ్యుకేషన్ కు మూల గ్రంథం లాంటి కామసూత్రను ఆ కోణంలో చూడకుండా అది దేశం పరువు తీస్తోందని అంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది అతి చేయడం తప్ప ఇంకేమీ కాదని మధ్యేవాదులు, ఆధునికులు మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/