Begin typing your search above and press return to search.
'కేపీ చౌదరి నాకు తెలుసు కానీ.. నా కూతురికి తెలియదు'!
By: Tupaki Desk | 25 Jun 2023 9:42 AM GMT"కబాలి" మూవీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్ సినీ, క్రీడా, రాజకీయా వర్గాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేపీ చౌదరిని కస్టడీకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు.. కీలక విషయాలు రాబట్టినట్లు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్ లో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది.
అవును... కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... సిక్కిరెడ్డి ఫ్లాట్ లోనే కేపీ చౌదరి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారని కథనాలొస్తున్నాయి. పాత పరిచయాల నేపథ్యంలో కేపీ చౌదరికి సిక్కిరెడ్డి తన ఫ్లాట్ ను ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తుంది.
అయితే ఈ విషయాలపై తాజాగా సిక్కిరెడ్డి తల్లి స్పందించారు. తమ కూతురికి డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సిక్కిరెడ్డి తల్లి మాధవి స్పష్టం చేశారు. కనీస విచారణ కూడా చేయకుండా.. తన ఆటతో దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన సిక్కిరెడ్డి పేరును కస్టడీ రిపోర్ట్ లో పెట్టడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
అయితే తన కుటుంబంతో కేపీ చౌదరికి ఉన్న పరిచయాన్ని ఆమె సవివరంగా వివరించే ప్రయ్తనం చేశారు. 2011 నుంచి కేపీ చౌదరి తమకు తెలుసు అని చెప్పిన సిక్కిరెడ్డి తల్లి మాదవి... ఒక వారం రోజుల పాటు ఇల్లు కావాలంటే స్నేహితహిల్స్ లో ఉన్న ఇంట్లో ఉండమని చెప్పామని తెలిపారు. కానీ అతడికి డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం తమకు తెలియదని... ఇప్పటికే పోలీసులు వచ్చి స్నేహితహిల్స్ లో ఉన్న ఇంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారని చెప్పారు.
ఇదే సమయంలో తన బిడ్డ సిక్కిరెడ్డికి కేపీ చౌదరికి ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేసిన ఆమె... తమ కూతురు పార్టీలకు వెళ్లదని, ఆమెకు మందు అలవాటు కూడా లేదని తెలిపారు.
కాగా... తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్ కేపీ చౌదరికి చెందిన ఫోన్, గూగుల్ డ్రైవ్ డేటాను సేకరించిన పోలీసులు.. అందులో ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్, ఫోన్ కాల్స్, ఫొటోలను బట్టి దర్యాప్తు సాగిస్తున్నారు.