Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేగా ఓడిన బడా నేత కూతురు
By: Tupaki Desk | 24 Oct 2019 1:30 PM GMTమహారాష్ట్రకు చెందిన దివంగత బీజేపీ నేత గోపినాథ్ ముండే కూతురు పంకజా ముండే. తండ్రి మరణానంతరం రాజకీయంగా వెలుగులోకి వచ్చారామె. గత పర్యాయం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. వరసకు సోదరుడు అయ్యే ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండేపై ఆమె విజయం సాధించారు. పాతికే వేల ఓట్ల తేడాతో అప్పుడు నెగ్గారామె.
గోపినాథ్ ముండేకు ఉండిన ఇమేజ్ తో ఆమెకు టక్కున మంత్రి పదవి కూడా దక్కింది. అయితే ఆమెపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువపై చిక్కీ స్కామ్ లో పంకజ పేరు ప్రముఖంగా వినిపించింది. బీజేపీ హయాంలో వార్తల్లోకి వచ్చిన బిగ్ స్కామ్స్ లో అది కూడా ఒకటి.
అయితే రాజకీయంగా ఆమెకు ఉన్న గుర్తింపుతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించే సాహసం చేయలేదు కమలం పార్టీ. ఇలాంటి నేపథ్యంలో.. ఎన్నికలు వచ్చాయి. గోపినాథ్ ముండే ఇమేజ్ ఈ సారి పంకజను కాపాడలేదు. ఎన్సీపీ తరఫున మరోసారి పోటీ చేసిన ఆమె సోదరుడు ధనుంజయ్ చేతిలో ఓటమిపాలయ్యారామె. తను ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టుగా ఆమె ప్రకటించుకున్నారు. ఓడిపోయిన నేతలు అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు కాబోలు.