Begin typing your search above and press return to search.
పాడు కుక్క దాడి చేసింది.. పాపకు వెయ్యి కట్లు వేయాల్సి వచ్చింది
By: Tupaki Desk | 1 March 2023 3:00 PM GMTవీధి కుక్క ఒకటి దాడి చేస్తే.. దినపత్రికల్లో మొదటి పేజీలో వార్తలు వచ్చే అవకాశం ఉందా? అంటే.. నో అంటే నో అనేస్తారు. కానీ.. పాడుకుక్కల తీరుతో ఇప్పుడు అలాంటి పరిస్థితి. అంతేనా.. వీధి కుక్కలు విరుచుకుపడుతున్న వైనంపై జనాల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఇటీవల ఒక చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి.. దారుణంగా హతమార్చటం.. దీనికి సంబంధించిన సీసీకెమేరా ఫుటేజ్ ఒకటి బయటకు రావటం కలకలంగా మారింది. అప్పటి నుంచి కుక్కల దాడులకు సంబంధించిన వార్తలకు మీడియాలో ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కుక్క దాడి చేసిన కారణంగా ఒక చిన్నారికి ఎదురైన తీవ్ర పరిస్థితుల గురించి తెలిస్తే.. ఇలాంటి డేంజర్ మనకు పొంచి ఉందన్న భయాందోళనలు వ్యక్తం కావటం ఖాయం. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆడుకోవాలన్న ఆరేళ్ల చిన్నారికి దారుణ అనుభవం ఎదురైంది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అందరికి షాకింగ్ గా మారింది.
అమెరికాలోని చెస్టర్ విల్లేలో ఆరేళ్ల చిన్నారి లిలీ.. ఫిబ్రవరి 18న తన స్నేహితురాలు ఇంటికి ఆడుకోవటానికి వెళ్లింది. వారింట్లో టేబుల్ మీద కూర్చున్న చిన్నారిపై ఆమె ఫ్రెండ్ ఇంట్లో పెంపుడు కుక్క అయిన పిట్ బుల్ అనే జాతి కుక్క.. పాప మీద అతి కిరాతకంగా దాడి చేసింది. కంటి కింది నుంచి ముఖం వరకు కొరికేసింది. దీంతో పెద్ద ఎత్తున పాప చేసిన అరుపులకు వంట చేస్తున్న స్నేహితురాలి తల్లి వచ్చి.. కుక్కను పక్కకు లాగేసింది.
ఆ వెంటనే పాప తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పాప కండీషన్ చూసి తాము ఏమీ చేయలేమని చెబితే.. బోస్టన్ లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాప వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతుందని చెప్పటంతో.. లిలీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో గోఫండ్ మీ పేజీని ఏర్పాటు చేసి నిధులు సేకరించారు.
ఇదిలా ఉండగా లిలీకి వైద్యం చేసిన వైద్యులు.. చిన్నారి ముఖం మీద వెయ్యి కుట్లు వేశారు. కుక్క దాడి కారణంగా పాప ముఖంలోని కండరాలన్నీ దెబ్బ తిన్నాయని.. ఇప్పట్లో తను మాట్లాడలేని కండీషన్ లో ఉందని.. పూర్తిగా కోలుకోవటానికి చాలా రోజులు పడుతుందని చెప్పారు. బంగారం లాంటి పాపకు భయంకరమైన అనుభవాన్ని పంచిన ఈ కుక్కపై ఇప్పుడు అందరు కారాలు మిరియాలు నూరే పరిస్థితి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.