Begin typing your search above and press return to search.
గుడివాడలో బాబు టూర్...కొడాలి నాని గెలుపుపై ప్రభావం
By: Tupaki Desk | 14 April 2023 12:49 PM GMTగుడివాడకు చంద్రబాబు వెళ్ళారు. ఇది చాలా కాలంగా అనుకుంటూ వస్తున్న కార్యక్రమం. చివరికి ఇన్నాళ్ళకు కుదిరింది. గుడివాడ వెళ్ళిన చంద్రబాబు కొడాలి నాని మీద నిప్పులు చెరిగారు. దానికి బదులుగా కొడాలి నాని ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బాబుని ఆయన ఏకంగా జిత్తులమారి నక్క అనేశారు. బాబుతో గుడివాడ అభివృద్ధి విషయంలో చర్చకు తాను సిద్ధమని చెప్పారు. పద్నాలుగేళ్ళ సీఎం అంటున్న చంద్రబాబు గుడివాడకు చేసిందేంటి అని నిలదీశారు.
ఆఖరుకు ఎన్టీఆర్ పుట్టిన చోటు నిమ్మకూరులో ఆయన విగ్రహం కూడా చంద్రబాబు కానీ తెలుగుదేశం కానీ ఎక్కడా పెట్టించలేకపోయారని మండిపడ్దారు. నందమూరి హరిక్రిష్ణ ఎంపీగా ఉన్నపుడు నిమ్మకూరుని అభివృద్ధి చేశారని, హరిక్రిష్ణ జూనియర్ ఎన్టీఆర్ తాను కలిసి సొంత ఖర్చుతో ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలను పెట్టారని నాని గుర్తు చేశారు.
అన్నీ అబద్ధాలు చెబుతూ ఖాళీ కుర్చీలకు బాబు ఉపన్యాసాలు ఇచ్చేస్తే సరిపోతుందా అని కొడాలి నాని తగులుకున్నారు. తాను అవినీతి చేశాను అంటున్న బాబు దాన్ని నిరూపిస్తే తాను స్వచ్చందంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని నాని సవాల్ చేశారు. బాబు ఒక్క ఎకరం అయినా కొని పేదలకు ఇళ్ళు కట్టించారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
గత నాలుగేళ్ళుగా గుడివాడలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఏకంగా ఇరవై మూడు వేల ఇళ్లని పేదలకు తమ ప్రభుత్వం ఇస్తోందని నాని వివరించారు. ఇక నాని మరో కీలకమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. గుడివాడకు బాబు ఎపుడు వచ్చినా టీడీపీ ఓడిపోతుందని అన్నారు. అందువల్ల బాబు గుడివాడకు రావడం తనకు ఫుల్ హ్యాపీ అంటున్నారు. ఈసారి తాను ఏ మాత్రం శ్రమ పెట్టకుండా అయిదవ సారి కూడా గెలిచి అసెంబ్లీకి వస్తానని అన్నారు.
తన విజయం బాబు పాదం గుడివాడలో మోపడంతోనే ఖాయం అయిందని నాని అంటున్నారు. బాబు గుడివాడ టూర్ తో తన గెలుపు మీద పూర్తి ప్రభావం చూపిస్తుందని నాని ఆ విధంగా ఒప్పుకున్నారు. అయితే అది తెలుగుదేశానికి ఏ విధంగానూ మేలు చేయకపోగా తనను గెలిపించి తీరుతుందని ఆయన అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు గుడివాడలో ఈసారి టీడీపీని గెలిపించాలని ఎన్నికలకు ఏడాది ముందే వచ్చి మరీ భారీ సభ పెట్టారు. అయితే బాబు వస్తే చాలు తాను గెలుస్తాను అని అది యాంటీ సెంటిమెంట్ అని కొడాలి నాని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలంటే ఏడాది పాటు ఆగాల్సిందే.
ఇక కొడాలి నాని మరో మాట అన్నారు. ఎపుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం తన మామ గారి ఊరు అయిన నిమ్మకూరుకు బాబు వచ్చారని, మళ్లీ 42 ఏళ్ళ తరువాత వచ్చి హడావుడి చెశారని. అంటే బాబుకు నిమ్మకూరుకు ఎన్టీఆర్ పుట్టిన గడ్డకు ఏ మాత్రం సంబంధం అభిమానం లేవని చెప్పడమే ఇక్కడ కొడాలి నాని ఉద్దేశ్యం. మరి నిమ్మకూరి ఇంటల్లుడు బాబుకు అన్న గారి దీవెనలు అసలు ఉండవని కొడాలి జోస్యం అయితే చెప్పేస్తున్నారు.