Begin typing your search above and press return to search.

బాబు పవన్ మధ్యలో కేసీయార్....?

By:  Tupaki Desk   |   20 Feb 2023 7:00 AM GMT
బాబు పవన్ మధ్యలో కేసీయార్....?
X
ఏపీ రాజకీయాల్లో జనసేన పవన్ కళ్యాణ్ అతంత్య కీలకం అవుతారు అన్నది అందరికీ తెలిసింది. ఆయనను ఎవరూ ఏ విధంగానూ తీసివేయలేరు ఆయన కింగ్ అవుతారా కింగ్ మేకర్ అవుతారా అంటే 2024 రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే. ఇదిలా ఉంటే తెలుగుదేశం జనసేన మధ్యన పొత్తు ఉంటుందని, ఇప్పటికే దానికి సంబంధించిన పూర్వ రంగం సిద్ధమైపోయినదని ప్రచారం లో ఉన్న మాట.

ఆ దిశగానే రెండు పార్టీల మధ్య మైత్రి సాగుతోంది. ప్రకటనలు అటూ ఇటూ వస్తున్నాయి. అయితే ఇపుడు కొత్త పలుకు అంటూ ఒక ప్రముఖ తెలుగు మీడియా వెలువరించిన కధనం చూస్తే మధ్యలో కేసీఆర్ వచ్చి చేరుతున్నారు అని అంటున్నారు. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో తన ఉనినికి బలంగా చాటుకోవడానికి చూస్తున్నారు.

అదే టైం లో బలమైన కాపు సామాజికవర్గానికి ఆయన గేలం వేస్తున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కాపులను ఓటు బ్యాంక్ గా చేసుకుని ఏపీలో రాజకీయం చేయాలన్నది  బీఆర్ఎస్ ఎత్తుగడగా ఉందని అంతా అనుకుంటున్నదే. అందుకే ప్రజారాజ్యం జనసేనలలో పనిచేసిన  తోట చంద్రశేఖర్ అనే కాపు నాయకుడిని ఏపీ బీయారెస్ ప్రెసిడెంట్ గా చేశారు అని అంటున్నారు.

ఇక ఇపుడు ఆయన ఫోకస్ అంతా జనసేన అధినేత మీదనే పడిందన్నదే కొత్త పలుకులో సదరు మీడియా చెబుతున్న మ్యాటర్. తమ వైపునకు పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఆయనను ఏపీ సీఎం ని చేసేందుకు తాము బాధ్యత వహిస్తామని ఒక రాయబారాన్ని కేసీఆర్ పంపించారు అన్నదే కొత్త పలుకుగా ఉంది అంటున్నారు ఏపీ సీఎం తో  బీఆర్ఎస్ కి నిజానికి సంబంధం లేదు. వారిది అంతా తెలంగాణావే.

అందుకే కాపుల కోరిక మేరకు వారికి ఎంతో ఇష్టుడైన వెండితెర నాయకుడు, రాజకీయాల్లో నవతరం నేత అయిన పవన్ని సీఎం చేస్తామని  బీఆర్ఎస్ హామీ ఇస్తోందిట. దీని కోసం వేయి కోట్ల రూపాయలు ఆఫర్ కూడా  బీఆర్ఎస్ అధినేతలు ఇచ్చారని ఆ కొత్త పలుకులో రాశారు. ఏపీలో కేవలం ముప్పయి సీట్లు గెలుచుకుంటే చాలు పవన్ సీఎం అని  బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా ఉంది ఆ కధనంలో.

అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తో కలసి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆయన  బీఆర్ఎస్ ఆఫర్ కి వెళ్తారా అన్నది ఇక్కడ పాయింట్. ఇక తమ దూతల ద్వారా పవన్ మీద కేసీఆర్  వత్తిడి చేస్తున్నట్లుగా ఆ పత్రిక రాసింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ పత్రికే అందులో రాసుకొచ్చిన మేరకు చూస్తే ఏపీలో వైసీపీకి మేలు చేయడానికే ఇలా కేసీఆర్ పవన్ని తమతో పొత్తుకు పిలుస్తున్నారు అని అనుమానించింది.

ఏపీలో వైసీపీ కి యాంటీగా ఓట్ల చీలిక ఉండరాదని, అందరికీ కూడగడతాను అని పవన్ చెబుతున్న వేళ ఈ కొత్త పలుకు కధనం చిత్రంగానే ఉంది అంటున్నారు. ఏపీలో తమకు ఏమీ లాభం లేని చోట కేవలం పొత్తుల కోసం  బీఆర్ఎస్ వేయి కోట్లు ఖర్చు పెడుతుందని అని ఊహించడంలోనే తేడా ఉందని అంటున్నరు. ఏపీలో  బీఆర్ఎస్ కి కావాల్సింది రాజకీ ఉనికి. పైగా ఆరు శాతం ఓట్లు. అందుకోసం ఆ పార్టీ తన ప్రయత్నాలు తాను చేసుకుంటుంది అని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా పవన్ విషయంలో కేసీఆర్ ఈ రకంగా వత్తిడి తెస్తున్నారు అంటూ వచ్చిన ఈ వాత్రా కధనం మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనం గా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.