Begin typing your search above and press return to search.
బాబు మాస్టర్ స్ట్రోక్ : సీపీఎస్ ప్లేస్ లో ఓపీఎస్ ...?
By: Tupaki Desk | 10 Jun 2023 8:57 AM GMTప్రభుత్వ ఉద్యోగు లతో ఉన్న గ్యాప్ ని ఏదో విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగ్గించుకునే ప్రయత్నం చేశారు. దాదాపు గా ఉద్యోగుల సమస్యల ను పరిష్కరించారు. దీంతో ఉద్యోగ సంఘాలు అందరూ సీఎం ని కలసి ప్రశంసిస్తున్నాయి. ఒక విధంగా ఎన్నికల ఏడాది లో జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారు అని అంతా అంటున్నారు.
ఉద్యోగుల కు ఈసారి కాస్తా ముందుగానే 12వ పీయార్సీ కమిటీ ని ప్రభుత్వం నియమిస్తోంది. గతం లో 27 శాతం ఫిట్మెంట్ ని ఇచ్చిన ప్రభుత్వం ఈసారి దాన్ని బాగా పెంచి ఉద్యోగుల ను టోటల్ గా ఆకట్టు కోవాలని చూస్తోంది. తొందర లోనే పీయార్సీకి కమిటీ కి ఎవరు సారధ్యం వహిస్తారో ప్రకటించి వర్క్ స్టార్ట్ చేసేలా చూస్తుంది అంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది మార్చిలో గా 12వ పీయార్సీ కమిటీ నివేదిక ప్రభుత్వం చేతిల్లో ఉండాల ని కోరుకుంటోంది. ఒక వేళ ఏ కారణం చేతనైనా లేట్ అయితే మాత్రం ఎన్నికల ముందు భారీ గా మధ్యంతర భృతి ని ప్రకటించడం ద్వారా ఉద్యోగ వర్గాల ను ఫుల్ గా సాటిస్ ఫై చేసి ఎన్నికల్లో వారి మద్దతు పొందాల ని వైసీపీ పక్కా ప్లాన్ తో ఉంది.
మరో వైపు ఉద్యోగుల కు ఇళ్ళ స్థలాల ను కూడా తొందర లోనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద ని అంటున్నారు పది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ను పర్మనెంట్ చేయడం ద్వారా కూడా భారీ గా రాజకీయ లబ్దినే వైసీపీ ఆశిస్తోంది అంటున్నారు. జగన్ పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేర కు సీపీఎస్ ని ఏపీ లో రద్దు చేశారు.దానికి బదులుగా బహుముఖంగా లాభాలు కలిగిన జీపీఎస్ ని రంగం లోకి తెచ్చారు.
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీం నే కోరుకున్నా వారికి కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు. మళ్లీ ఓపీఎస్ అన్నది పునరుద్ధరణ జరిగే విషయం కాదని అంటున్నారు. దాంతో అన్ని రకాలుగా మంచిగా ఉండే జీపీఎస్ తో వారు కూడా ఎలాగోలా సర్దుకుపోయే పరిస్థితి ఉంది. దీని మీద విపక్షాల నుంచి కూడా పెద్దగా రియాక్షన్ రావడంలేదు.
ఉద్యోగ వర్గాల లో సీపీఎస్ ప్లేస్ లో జీపీఎస్ మీద అసంతృప్తి ఉందని టీడీపీ అనుకూల మీడియా రాస్తోంది కానీ టీడీపీ మనోగతం ఏంటో ఈ రోజు కీ తెలియడంలేదు. అయితే వైసీపీ కి గుత్తమొత్తంగా అంటే 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలు కలసి అర కోటి కి పైగా ఓటు బ్యాంక్ తరలిపోతూంటే టీడీపీ ఊరకే చేతులు ముడుచుకుని కూర్చుంటుందా అన్నదే చర్చకు వస్తోంది.
మరి టీడీపీ ఈ దశలో ఏమి చేయాలి అంటే సీపీఎస్ రద్దు చేసిన స్థానంలో ఓపీఎస్ ని తీసుకుని రావాలి. ఆ దిశగానే ఇపుడు టీడీపీ ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. ఓపీఎస్ అంటే నెత్తి మీద అతి పెద్ద ఆర్థిక భారాన్ని పెట్టుకున్నట్లే అంటున్నారు. చంద్రబాబు 2014 లోనే ఈ హామీ ఇవ్వలేదు. ఇపుడు ఏపీ పుట్టెడు అప్పుల్లో ఉంది. అన్నీ తెలిసి ఆ హామీ ఇస్తారా అన్నదే చర్చగా ఉంది.
అయితే చావో రేవో అన్నట్లుగా ఉన్న ఈసారి ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకమే. అందువల్ల ఉద్యోగ వర్గాలను తమ వైపు తిప్పుకోవడాని కి ఇంత కు మించిన మార్గం లేదని అంటున్నారు. దాంతో చంద్రబాబు ఓపీఎస్ ని తీసుకుని వస్తామని అతి పెద్ద హామీని ఎన్నికల ప్రణాళిక లో పెట్టబోతున్నారు అని అంటున్నారు. అదే జరిగితే మొత్తం ఉద్యోగుల మద్దతు ఆ వైపు నుంచి ఈ వైపున కు మారుతుంది అని టీడీపీ గట్టిగా నమ్ముతోంది.
ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయం లో వైసీపీ ప్రభుత్వం కొన్ని కండిషన్లతో పర్మనెంట్ చెస్తోంది. అది కూడా 2014 దాకానే. దాంతో ఆ తరువాత నుంచి పనిచేస్తున్న వారి లో అసంతృప్తి ఉంది. అయితే వారిని దశల వారీ గా పర్మనెంట్ చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. కానీ ఇపుడు టీడీపీ ఎన్నికల ప్రణాళిక లో వారి మీద కూడా గురి పెట్టబోతోంది అని అంటున్నారు.
ఎలాంటి కండిషన్లు లేకుండా 2024 మార్చి నాటి కి ఉన్న అందరి కాంట్రాక్టు ఉద్యోగుల ను పర్మనెంట్ చేస్తామని టీడీపీ ఒక బ్రహ్మాండమైన హామీ ని ఎన్నికల ప్రణాళిక లో పొందుపరచనుందని అంటున్నారు. అంతే కాదు, 2027 దాకా ఉద్యోగుల కరవు భత్యాన్ని వైసీపీ ప్రభుత్వం సర్దుబాటు చేసేలా హామీ ఇచ్చింది. కానీ టీడీపీ అధికారం లోకి వస్తే మొత్తం డీయే బకాయిలు అన్నీ కూడా ఒక్క దెబ్బతో తీర్చేస్తామని మరో హామీ ని ఇవ్వబోతోంది అని అంటున్నారు.
అంతే కాదు తాము పవర్ లోకి వస్తే 12వ పీయార్సీ విషయంలో అద్భుతమైన ఫిట్ మెంట్ తో ఉద్యోగుల కు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వనుంది అని తెలుస్తోంది. మరి ఇదే విధంగా టీడీపీ కనుక ఎన్నికల ప్రణాళిక లో పెడితే అపుడు ప్రభుత్వ ఉద్యోగులు గుత్తమొత్తంగా టీడీపీ కి ఓటు వేస్తారా అన్నదే చర్చగా ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల లో కూడా చీలిక ఉందని, వారూ అటూ ఇటూ ఉన్నారని అంటున్నారు. అందువల్ల టీడీపీ దుస్సాహం చేసి ఓపీఎస్ వంటివి నెత్తికెత్తుకున్నా పూర్తి ఓట్లు పడతాయా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తానికి టీడీపీ వైసీపీల మధ్యలో పోటీ తో ఈసారి ఉద్యోగుల పంట అయితే పండనుంది అంటున్నారు.