Begin typing your search above and press return to search.
నారా బ్రాహ్మణి గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్న బాబు...?
By: Tupaki Desk | 10 Feb 2023 3:03 PM GMTతెలుగుదేశం పార్టీకి గ్రామర్ కంటెంట్ అంతా చంద్రబాబు అయితే గ్లామర్ నందమూరి వారిది. ఆ ఇంటి నుంచే తన కోడలిని తెచ్చుకున్న చంద్రబాబు మాస్టర్ ప్లాన్స్ ఇపుడు కొత్త పుంతలు తొక్కనున్నాయి. ఎటూ ప్రముఖ నటుడు ఎన్టీయార్ తనయుడు బాలయ్య బాబుకు బావమరిది. ఆయన సినీ గ్లామర్ అండగా ఉంటుంది. ఇపుడు ఆయన కుమార్తె తన కోడలు అయిన బ్రాహ్మణిని పొలిటికల్ గా గ్రాండ్ ఎంట్రీ ఇప్పిస్తే సైకిల్ జోరుని ఎవరూ ఆపలేరు అన్నది బాబు భారీ వ్యూహం అని అంటున్నారు.
ఈ విషయాన్ని ఆయన సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తోడుగా చినబాబు లోకేష్ రంగంలోకి దిగి పాదయాత్రను స్టార్ట్ చేశారు. మరో వైపు బాలయ్య ఉన్నారు. పొత్తులు కుదిరితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెంట వస్తారు ఇలా వైసీపీని ఓడించేందుకు తన హవా చాటేందుకు అన్ని రకాలైన అస్త్ర శస్త్రాలను చంద్రబాబు రెడీ చేసుకుంటున్నారు.
ఈ టైం లో ఆయనకు వచ్చిన సూపర్ ఐడియా బ్రాహ్మణి పోటీ అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎంత ముఖ్యమో అదే టైం లో పాతిక ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేయడం అంతే ముఖ్యం. భారీ ఎత్తున ఎంపీ సీట్లు వస్తే కనుక కచ్చితంగా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు తనదైన రాజకీయ చాణక్యాన్ని చూపించేందుకు వీలు దొరుకుతుంది. అదే విధంగా ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సాయం అవసరం కాబట్టి ఎంపీల మద్దతుతోనే అది సాధ్యపడుతుంది కాబట్టి ఈసారి ఎక్కువ మంది ఎంపీలను ఆయన గెలుచుకోవాల్ని చూస్తున్నారు.
అందులో భాగంగా రాజకీయ రాజధానిగా పేరు గడించిన విజయవాడ నుంచే తన కోడలి రాజకీయ అరంగ్రేట్రానికి బాబు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. విజయవాడ ఎంపీ సీటులో ప్రస్తుతం కేశినేని నాని ఉన్నారు. ఆయన గత రెండు దఫాలుగా గెలుస్తూ వస్తున్నరు. ఇక ఈ మధ్య ఆయనకు అధినాయకత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. అదే టైం లో ఆయన సోదరుడు కేశినేని చిన్ని అలియాస్ శివనాధ్ ఎంపీ టికెట్ కోరుతున్నారు.
ఈ మేరకు ఆయన అధినాయకత్వం మీద వత్తిడి తెస్తున్నారు. అయితే కేశినేని నాని తనకు టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ తమ్ముడు శివనాధ్ కి ఇస్తే మాత్రం తానే దగ్గరుండి ఓడిస్తాను అని గట్టి శపధం చేశారు. దాంతో కేశినేని వర్సెస్ శివనాధ్ ల మధ్యలో విజయవాడ తెలుగుదేశం ఎంపీ సీటు నలుగుతోంది. ఈ అన్నదమ్ములు ఇద్దరికీ కాకుండా వేరే వారికి ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు తెలుగుదేశంలో ఉన్నాయి.
అయితే వేరే వారికి ఇస్తే శివనాధ్ సహకారం ఉండదు. ఆయనకు కూడా ఎంపీ సీట్లో మంచి పట్టు ఉంది. క్యాడర్ కూడా ఆయన వైపు ఉంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు ఏకంగా తన కోడలిని తెచ్చి పెడితే కేశినేని బ్రదర్స్ సహా ఎవరూ ఏమీ మాట్లాడరు అన్న ఎత్తుగడ వేస్తున్నారుట.
దాంతో పాటు కీలకమైన ఈ ఎన్నికల్లో నందమూరి వారి బ్లడ్ అయిన బ్రాహ్మణిని నవతరం ప్రతినిధిగా ఉన్న మహిళను తెచ్చి పార్టీ తరఫున పోటీ పెడితే కొత్త క్రెజూ మోజూ కూడా వస్తాయని బాబు అంచనా వేస్తున్నారు. ఇక బ్రాహ్మణి విషయనికి వస్తే ఆమె అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసింది. అలా ఉన్నత విద్యావంతురాలు కాబట్టి ఇది మంచి నిర్ణయం అవుతుందని అంతా అంటున్నారు.
అదే విధంగా బ్రాహ్మణి లాంటి విద్యావంతురాలిని పార్లమెంట్‌కి పంపడం వల్ల తెలుగుదేశంకు కొత్త ఇమేజ్ వస్తుందని భావిస్తున్నారుట. రేపటి రోజున బీజేపీతో పొత్తులు కలిస్తే తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో బ్రాహ్మణి కేంద్ర మంత్రి అయినా అవుతుంది అని అంటున్నారు.
ఆమెను ఇప్పటి నుంచే రాజకీయాల్లోకి తేవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి కొత్త తరం నాయకత్వం ఉందని తమ్ముళ్లకు గట్టి భరోసా కూడా ఇవ్వవచ్చు అన్నదే బాబు ఎత్తుగడ అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాలయ్య కూతురు, లోకేష్ భార బాబు కోడలు అయిన బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది అంటున్నారు. గ్రాండ్ గా ఆమె ఎంట్రీ ఉండేలా ప్లాన్స్ మాత్రం చకచకా సాగుతున్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.