Begin typing your search above and press return to search.
బాబుకు ఫోకస్ లేదా?
By: Tupaki Desk | 3 March 2023 2:39 PM GMTఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్టుగా ఉంది.. టీడీపీ పరిస్థితి! 2014 ఎన్నికల్లో మూడు పార్టీలు అండగా నిలిస్తే.. చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం.. వంటి పాదయాత్ర కలిసి వస్తే.. అన్నీ కలిపి చంద్రబాబుకు ఆయన పార్టీకి దక్కిన సీట్లు 102. మెజారిటీకి ఇవి.. కేవలం 14 అదనం మాత్రమే. ఈ పొత్తుల కోసం.. చంద్రబాబు అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వచ్చింది.
ఇక, 2019 ఎన్నికల సమయానికి అసలు పొత్తులే లేకండా ఒంటరి పోరును ఎంచుకున్నారు. దీనికి తోడు ప్రభుత్వంపై కన్నా.. టీడీపీ నేతలపై ప్రజల్లో కరడుగట్టుకున్న వ్యతిరేకత వెరసి.. మొత్తంగా.. టీడీపీని 23 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. అంటే.. ఒకరకంగా.. పొత్తు పెట్టుకునే సమయంలో ఆయన వదిలేయడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందనే వాదన వినిపించింది.
ఇక, ఇప్పుడు కూడా మరోసారి పొత్తులపైనే చంద్రబాబు కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. కానీ, వాస్తవం ఏంటం టే.. చంద్రబాబు ఈ పొత్తులపై చూపిస్తున్న శ్రద్ధలో కేవలం 100 నియోజకవర్గాలపై దృష్టి పెట్టి.. ముందు గానే పార్టీనేతలను నిర్ణయించేస్తే.. విజయం దక్కించుకోవడం సులభం అవుతుందని చెబుతున్నారు పరిశీలకులు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టీడీపీకి బలమైన కంచు కోటలు ఉన్నాయి.
వాటిని లెక్కలోకి తీసుకుంటే.. 100 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన శ్రేణులతో పాటు నాయకులు కూడా ఉన్నారు. వీరిని నమ్ముకుని రంగంలోకి దిగితే అధికారం చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేమీకాదని అంటు న్నారు.. పరిశీలకులు. కానీ, ఎటొచ్చీ.. ఈ సలహాను వినిపించుకునే నాథుడు, వినేనాధుడు కూడా కరువ య్యారనేది ప్రధాన కీలక అంశం. మరి ఇప్పటికైనా.. ఈ తరహా ఆలోచన దిశగా చంద్రబాబు అడుగులు వేయాలని కోరుతున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.