రామమందిర భూమిపూజ వేళ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

Wed Aug 05 2020 17:41:17 GMT+0530 (IST)

Asaduddin's key remarks during the Ram Mandir Bhumi Puja

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ చేశారు. ఈ అద్భుత సందర్భాన్ని దేశ ప్రజలంతా కళ్లారా వీక్షించి తరించారు.ఈ సందర్భంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని వ్యాఖ్యానించారు.

అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చరిత్రను ఎవరూ మార్చలేరంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

ఇక ఇప్పటికే అసదుద్దీన్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓ వర్గం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజ్యాంగ విరుద్దం అంటూ గతంలో విమర్శించారు.