లక్ష కోట్లతో జూమ్ భారీ డీల్ .. ఎందుకంటే

Tue Jul 20 2021 12:03:47 GMT+0530 (IST)

Zoom huge deal with lakh crores .. because

ప్రపంచం ప్రస్తుతం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది. టెక్నాలజీ రంగంలో తాజాగా మరో భారీ ఒప్పందానికి సర్వం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ ఏకంగా సుమారు 14.7 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. కరోనా కాలం తర్వాత ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్ కు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలోనే జూమ్ ఈ ఒప్పందాన్ని చేసుకోనుందని తెలుస్తోంది.ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్ వేర్ ప్రొవెడర్ ఫైవ్ 9 ను జూమ్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ కుదిరితే ఇకపై జూమ్ కు ఫైవ్ 9 క్లౌడింగ్ సాఫ్ట్ వేర్ ఆపరేటింగ్ యూనిట్ గా మారనుంది. ఈ భారీ డీల్ 2022 ఫస్టాఫ్ లో ఓ కొలిక్కి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జూమ్ కంపెనీ ప్రస్తుతం విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 792450 కోట్లు. ఇక ఫైవ్ 9 కంపెనీ విషయానికొస్తే . ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్ వేర్ కంపెనీ సురక్షితమైన క్లౌడ్ సేవలను అందిస్తోంది. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్ ల నిర్వహణ ఆప్టిమైజేషన్ ను అనుమతించే సులభమైన యాప్. ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తమ యూజర్లు షేర్ చేసుకునే డాక్యుమెంట్లు మరింత సులభంగా ఉంటాయని జూమ్ భావిస్తున్నట్లు సమాచారం.

దీంతో ఫైవ్ 9 క్లౌడింగ్ సాఫ్ట్ వేర్ జూమ్ కు ఆపరేటింగ్ యూనిట్ గా మారనుంది. అంతేకాకుండా ఫైవ్9 కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రోవాన్ ట్రోలోప్ జూమ్ సంస్థకు ప్రెసిడెంట్ కానున్నారు. ఒప్పందం ప్రకారం..రెండు కంపెనీల బోర్డులచే ఆమోదం పొందిన తరువాత ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఫైవ్ 9 షేర్లు శుక్రవారం 0.6 శాతం పెరిగి 177.60 డాలర్లకు చేరుకున్నాయి.  జూమ్ 1.4 శాతం పెరిగి 361.97 డాలర్ల వద్ద స్థిర పడింది. జూమ్ కంపెనీ విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 792450 కోట్లు).

ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్-బేస్డ్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో మేటి. దీని అత్యంత స్కేలబుల్   సురక్షితమైన క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్ ల నిర్వహణ ఆప్టిమైజేషన్ ను అనుమతించే సులభమైన యాప్. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్ వేర్ తో జూమ్ ఆన్ లైన్ సమావేశాల్లో పంచుకునే వివిధ అంశాలకు చెందిన డాక్యుమెంట్లు మరింత సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది.