Begin typing your search above and press return to search.

మానవత్వం చాటుకున్న జెడ్పీ ఛైర్మన్.. కరోనా మృతుడికి అంత్యక్రియలు

By:  Tupaki Desk   |   4 Aug 2020 12:30 PM GMT
మానవత్వం చాటుకున్న జెడ్పీ ఛైర్మన్.. కరోనా మృతుడికి అంత్యక్రియలు
X
కరోనా మహమ్మారి .. దేశంలో రోజురోజుకి మరింతగా విలయతాండవం చేస్తూ మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని మింగేస్తుంది. కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా బాగా పెరిగిపోయాయి. కరోనా చికిత్స గురించి కాసేపు పక్కన పెడితే ... కరోనాతో చనిపోతే వారికీ అంత్యక్రియలు చేయడానికి కూడా కొందరు కుటుంబ సభ్యులు ముందుకురావడం లేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల్లో కరోనా వైరస్ ఉండదు అని , అలాగే PPE కిట్స్ వేసుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సంప్రదాయబద్ధంగా వారికీ అంత్యక్రియలు నిర్వహించవచ్చు అని వైద్యులు చెప్తున్నా కూడా కుటుంబ సభ్యులు ముందుకు రావడంలేదు.

కరోనా మృతులకు దహన సంస్కారాలు చేయడానికి వెనుకడుగు వేస్తున్న ఈ రోజుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు కరోనాతో చనిపోయిన వ్యక్తికి దగ్గరుండి అంతిమ సంస్కరాలు చేయించి మానవత్వాన్ని చూపించారు. మంథని పట్టణంలోని సత్యసాయినగర్‌ కు చెందిన 29 ఏళ్ల యువకుడు మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైయ్యాడు. దానితో కరోనా సోకిదేమో అన్న అనుమానంతో కరోనా టెస్ట్ చేపించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ ఆ యువకుడు కన్నుమూశాడు.

మృతదేహాన్ని మంథనికి తరలించగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరు ముందుకు రాలేదు. ఆ విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆ యువకుడి కుటుంబానికి అండగా నిలిచాడు. బంధువులతో మాట్లాడి కొందరిని ఒప్పించారు. వారి సహాయంతో దగ్గరుండి గోదారి తీరంలో అంతిమ సంస్కారాలు చేయించారు. కరోనా సోకిన వారితో ప్రేమగా ఉండాలని, నిర్లక్ష్యం చేయొదద్దు అని తెలిపారు. మనోధైర్యం కల్పిస్తే బాధితులు త్వరగా కోలుకుంటారని, మనస్థైర్యాన్ని దెబ్బతిస్తే గుండెనిబ్బరం కోల్పోయి మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. కరోనా సోకితే అదేదో పెద్ద చేయకూడని తప్పుగా భావించకూడదు అని తెలిపారు.