Begin typing your search above and press return to search.

కేంద్రంతో సఖ్యతకు స్పష్టమైన సంకేతాలు.. ఇరు వైపులా..

By:  Tupaki Desk   |   27 May 2019 12:00 PM GMT
కేంద్రంతో సఖ్యతకు స్పష్టమైన సంకేతాలు.. ఇరు వైపులా..
X
ఈ నెల 30 గురువారం ... అదే రోజు విశ్వ క్రికెట్ సంరంభం అదేనండీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమవుతోంది... అదే రోజు దేశంలో తన ఛరిష్మాతో రెండో సారి బిజెపికి తిరుగులేని విజయాన్నందించినా నరేంద్రమోదీ ప్రధానిగా , 9ఏళ్ల అవిశ్రాంత పోరాటం తర్వాత ప్రజల మనసులు గెలుచుకొని రికార్టు స్థాయి విజయాన్ని అందుకున్న వైఎస్ జగనమోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది... తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించానని.. అయితే తనకూ ఆరోజు ప్రమాణ స్వీకారం ఉందని రాలేనని ఎవరైనా పార్టీ తరపున హాజరవుతారని చెప్పారట... అదే రోజు జగన్ కలిసి శుభాకాంక్షలు చెప్పిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాదవ్ కూడా పార్టీ తరపున జాతీయ నేతలు ప్రమాణ స్వీకారానికి హజరవుతారని స్పష్టం చేసినట్లు తెలిసింది... ఇదిలా ఉంటే మోడీ ప్రమాణ స్వీకారానికి హజరవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారట... 30 వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 7 గంటల 1 నిమిషానికి మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. జగన్ ఆ రోజు మధ్యాహ్నాం 12 గంటల 24 నిమిషాలకు విజయవాడలో ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు..

అయితే జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి హజరవుతున్నారట... ఎందుకంటే జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ విజయవాడలో హజరవుతున్నారు.. జగన్ ప్రమాణ స్వీకారం తరువాత ఏపీ సీఎం హోదాలో జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళి మోడీ ప్రమాణ స్వీకారానికి హజరవుతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ప్రత్యేక హోదా , పోలవరానికి నిధులు , విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన పనులు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు సాయం ఇలా పలు అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి.. ఈ పరిస్థితుల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి తో కాకుండా సఖ్యతతో సయోధ్యతో రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే లక్యంతో జగన్ అడుగులేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి గతంలో కంటే భారీ మెజార్టీ సాధించి తిరుగులేని శక్తిగా ఎదిగింది.. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల హక్కులంటూ టైం వేస్ఠ్ చేసే బదులు సయోధ్యతో వీలైనన్ని నిధులు రాబట్టాలని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం... జగన్ మైండ్ సెట్ ను దృష్టిలో పెట్టుకొనే బిజెపికూడా ప్రతినిధులను పంపిస్తోందని బిజెపి వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది... మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్దికి ఇద్దరూ కలిసి పనిచేద్దామని కేసీఆర్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.. ఏపీ కూడా అభివృద్దిచెందాలి.. ప్రత్యేక హోదాకు అడ్డురామని మద్దతిస్తామని కేసీఆర్ ప్రకటించారు.. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి కేంద్రం నుంచి ఇరు రాష్ట్ర్లాల జరగాల్సిన న్యాయం, నిధులను సాధించడమే లక్యంగా అడుగులు వేయడం రాజకీయంగా గొప్ప ముందడుగనే వాదన వినిపిస్తోంది.. తెలంగాణలో కాళేశ్వరం ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం ప్రకారం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లాంటి సమస్యలకు పరిష్కారం లభించాల్సి ఉంది... ఇప్పుడు తాజా గా రెండు రాష్ట్రాల సీఎంలు మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్తుడటం... బిజెపి జాతీయ ప్రతినిధులు జగన్ ప్రమాణ స్వీకారానికి హజరవ్వడం ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయమే...

మరో వైపు మోడీ ప్రమాణ స్వీకారానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, జగన్ తల్లి విజయమ్మ కూడా జగన్ తో పాటు వెళ్తున్నారట.. గతంలో వైఎస్ మరణం తర్వాత జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని , జగన్ పై కక్ష సాధింపు మానుకోవాలని కోరడానికి జగన్ తో పాటు విజయమ్మ కూడా సోనియాగాంధీని కలిశారు.. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా సోనియా తీవ్రంగా అవమానించారనే ప్రచారం జరిగింది.. ఎక్కడైతే అవమానానికి గురైందో..అక్కడే తన తల్లి తలెత్తుకునేలా.. స్వయంగా జగనే విజయమ్మ ను ఢిల్లీ కు తీసుకుపోతారనే ప్రచారం జరుగుతోంది...