కారుణ్య నియామకాలపై జగన్ సంచలన నిర్ణయం

Mon Oct 18 2021 19:00:01 GMT+0530 (IST)

Ys Jagan Sensational decision on compassionate appointments

కరోనా కల్లోలం దేశాలకు దేశాలను వణికించింది. ఈ కరోనా మహమ్మారి పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలిచివేసింది. మామూలు పేద ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరూ ఈ కరోనా బారిన పడి మృతి చెందారు. మృతిచెందిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కరోనా బారినపడి మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఏపీ సీఎం జగన్ తీపికబురు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కరోనా కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామాకాలు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యరంగంపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్.. వైద్య ఆరోగ్య రంగంలో నాడు-నేడు  కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు పనుల పురోగతి వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు వారి కుటుంబాల వారికి భరోసా కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.వచ్చే నెలలలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు జగన్.