అవినీతిని తొవ్వుతూనే.. అభివృద్ధిపై దృష్టి.. జగన్ వ్యూహం ఇదే..

Sat Jul 20 2019 07:00:02 GMT+0530 (IST)

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం మేనిఫెస్టో అమలుకుఎక్కువగా ప్రాధాన్యం ఇ చ్చింది. ఇస్తోంది కూడా. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ధికి కూడా తగిన విధంగా ప్రాధాన్యం ఇవ్వాలని సీ ఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఐదు మార్గాలను ఆయన ఎంచుకుంటున్నట్టు తెలిసింది. ఒకటి.. గత ప్రభుత్వం తాలూకు పనులు ప్రాజెక్టులను కొనసాగిస్తారు. అయితే వీటిలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావ డం ద్వారా ప్రజల్లో చంద్రబాబు ఇమేజ్ ను భారీ రేంజ్‌లో పతనం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. అదే సమ యంలో రెండో వ్యూహంగా తక్కువ ధరలకే ఆయా ప్రాజెక్టులు పూర్తి చేసేవారికి అవకాశం కల్పిస్తారు.ఇందులోనూ.. తక్కువ ధరలకే చేయాల్సిన చేసే పనులను చంద్రబాబు ఎక్కువ ధరలకు కేటాయించి సొమ్ము చేసుకు న్నారని లేదా తనకు నచ్చిన నవయుగ వంటి కంపెనీలకు అవకాశం ఇచ్చారని ప్రభుత్వం ప్రచారం చేయడం ద్వారా ఈ విషయంలోనూ తమకు అనుకూలంగా చక్రం తిప్పేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇక మూడో విధానంలో ప్రభుత్వమే నిధులు సమకూర్చడం. సాధ్యమైనంత వరకు కొన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వమే నిధులు సమకూ ర్చాలని నిర్ణయించుకుంది. దీనికి గాను అవసరమైతే.. బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడం ద్వారా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగేలా చూడాలని భావిస్తోంది.

ఇక నాలుగో ప్రాధాన్యం..  పారదర్శకంగా నిర్వహించడం ఎక్కడా అవినీతి మచ్చలేకుండా.. తక్కువ ధరలకే తక్కువ సమయానికే వీటిని నిర్వహించడం ద్వారా ప్రజల్లో మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకునేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఇక లాస్ట్ అండ్ ఐదోవ్యూహం.. కేంద్రం నుంచి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను కేంద్రానికే పూర్తిగా అప్పగించాలని నిర్ణయించింది. ఈ విషయంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ పోలవరం ప్రాజెక్టు కేంద్ర విద్యా సంస్థలు ఉన్నాయి. ఇలా ఈ ఐదు వ్యూహాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.