Begin typing your search above and press return to search.

డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆ యూట్యూబర్ ప్రశాంతంగా ఉన్నాడట..!

By:  Tupaki Desk   |   16 May 2022 5:36 AM GMT
డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆ యూట్యూబర్ ప్రశాంతంగా ఉన్నాడట..!
X
క్రిప్టో కరెన్సీ నార్కెట్ క్రాష్ అవ్వడంతో... ప్రముఖ యూట్యూబర్ కేఎస్ఐ సుమారు 2.8 మిలియన్ పౌండ్లను కోల్పోయారు. అంటే మన రూపాయల్లో దాదాపు 26.61 కోట్లను నష్టపోయారు. లునా క్రిప్టో కరెన్సీ విలువ ప్రస్తుతం సున్నాకు చేరిన సంగతి తెలిసిందే. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వంద శాతం క్రాష్ అయింది. ఈ లునా కరెన్సీలో యూట్యూబర్ కేఎస్ఐ 2.8 మిలియన్ పౌండ్ల పెట్టుబడులను పెట్టారు. మార్కెట్ క్రాష్ అయిన తర్వాత ఆయన డబ్బు ను పోగొట్టుకున్నారు.

గురువారం ఈ మార్కెట్ క్రాష్ తర్వాత కేఎస్ఐ తాత్వికమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో డబ్బుల కంటే ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయని ఇటీవలే తాను తెలుసుకున్నట్లు చెప్పారు. తాను తీసుకున్న థెరపీ వల్లే ఇదంతా తెలిసిందన్నారు.

ప్రస్తుతం తాను చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పారు. ఒకప్పుడు నగదు సర్వస్వం అని తాను భావించే వాడినని... కానీ ఆ తర్వాత నగదే జీవితం కాదని తెలుసుకున్నానని చెప్పారు. కేఎస్ఐ అసలు పేరు జేజే ఓడతుంజీ.

గతేడాది తాను ఓ వ్యక్తి దగ్గరకు థెరపీకి వెళ్లాలని, ఆ థెరపీ తర్వాత తాను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. "నేను లునా కరెన్సీలను 2.8 మిలియన్ పౌండ్ల కు కొనుగోలు చేశాను. వీటి విలువ ఇప్పుడు 50 వేల కంటే తక్కువ కు పడిపోయాయి. కానీ నేను ఓకే.. ఎందుకంటే నేను చనిపోలేదు కదా. నాకు మా ఫ్యామిలీ ఉంది. ఫ్రెండ్స్ ఉన్నారు. పని విషయంలో నీతి నియమాలు పాటిస్తున్నాను." అని కేఎస్ఐ ట్వీట్ చేశారు. స్థిరమైన కాయిన్ టెర్రాయూఎస్డీ సిస్టర్ కాయిన్ లునా ఈ మధ్య భారీగా నష్టపోయింది.

శుక్రవారం దీని విలువ సున్నా డాలర్లకు దిగొచ్చింది. ఏప్రిల్ లో ఈ కరెన్సీ విలున 110 డాలర్లకు పైనే ట్రేడ్ అయింది. ఇతర క్రిప్టో కరెన్సీ ల విలువ కూడా ఈ మధ్య భారీగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బిట్ కాయిన్ విలువ 30 వేల డాలర్ల కిందకు పడిపోయింది. శనివారం ఉదయం ఒక్కో కాయిన్ విలువ 29595 డాలర్లకు తగ్గింది. టెర్రాయూఎస్ఎస్ డీ కూడా కుప్పకూలింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 1.33 ట్రిలియన్ డాలర్ల కు తగ్గింది.

ఇథెరియం కూడా పడిపోతూనే ఉంది. రెండో అతిపెద్ద కరెన్సీ అయిన ఈ కరెన్సీ విలువ 1.2 శాతం తగ్గి 2030 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే సమయంలో డోజ్ కాయిన్ విలువ 2.7 శాతం నష్టం లో 0.088207 డాలర్ల వద్ద ఉంది. శిబా ఇను కూడా భారీగా పతనం ఉంది. ఈ కరెన్సీ విలువ 24 గంటల్లో 0.000001212 డాలర్లకు దిగొచ్చింది. గత రెండేళ్లలో బిట్ కాయిన్ విలువ ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారి.