కరోనా టైంలో రేవ్ పార్టీ.. యువతీ యువకుల అరెస్ట్

Sun Jul 05 2020 19:50:41 GMT+0530 (IST)

Youth Arrested during Rave Party

కరోనా విజృంభిస్తుంటే అందరూ బతుకు జీవుడా అంటూ ఇంట్లోనే ప్రాణభయంతో బయటకు వెళ్లకుండా దాక్కుంటున్నారు. కనీసం బయటకు వెళ్లి కూరగాయలు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా జంకుతున్న పరిస్థితి నెలకొంది. సామాజికదూరం పాటిస్తూ.. మాస్కులతో దూరంగా ఉంటున్నారు.అయితే ఈ ప్రబుద్ధులు మాత్రం ఇంతటి కరోనా వ్యాప్తి సమయంలోనూ విచ్చలవిడి శృంగారానికి తెగబడ్డారు. ప్రభుత్వాలు ఎన్ని నిషేధాజ్ఞలు పెట్టినా కొందరికీ మాత్రం ఏం భయాలు లేకుండా హైదరాబాద్ లో పార్టీలు ఫంక్షన్లు రేవ్ పార్టీలు అంటూ గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాను అంటించుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో నిన్న రాత్రి కొందరు యువకులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నలుగురు యువతులు సహా మొత్తం 8మందిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువకులునలుగురు యువతులు కలిసి ఈ రేవ్ పార్టీలో రాత్రంతా శృంగార ఢోలికల్లో మునిగి తేలినట్టు తెలిసింది. వీరిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది..