నెల్లూరులో యువతి సెల్ఫీ సూసైడ్ కలకలం

Sat Jul 11 2020 21:30:09 GMT+0530 (IST)

Young woman commits suicide in Nellore

దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఉదంతం మొదలుకొని.....తెలంగాణ రాజధానిలో జరిగిన దిశ ఘటన వరకు... ఇలాంటి ఎన్నో ఘటనలు మన దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిలువులద్దంలా నిలిచాయి. ఇవికాక బయటకు రాని అకృత్యాుల మరెన్నో ఉన్నాయి. వేధింపులకు తట్టుకోలేక తనువు చాలిస్తోన్న మహిళలు యువతుల ఉదంతాలు మరెన్నో ఉన్నాయి. తాజాగా నెల్లూరులో యువకుల వేధింపులు తాళలేని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిగ్రీ చదువుతున్న ఆ యువతి.....ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులు ఆలస్యంగా చూడడంతో...జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తమ కూతురి చావుకు ముగ్గురు యువకులే కారణమని పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆ యువతి ఆత్మహత్య చేసుకునే కొద్ది నిమిషాల ముందు వరకు ఓ యువకుడితో వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. తనతో మాట్లాడాలంటూ ఆ యువకుడికి యువతి చాలాసార్లు మెసేజ్ చేసినా స్పందన రాలేదని తెలుస్తోంది. అదే సమయంలో మరో యువకుడికి కూడా ఆమె మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరితో పాటు మరో యువకుడికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు ఆ యువతికి క్లాస్‌మేట్స్ గానీ ఫ్రెండ్స్ గానీ కాదని యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమ కూతురు గదిలో నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులకు యువతి తల్లిదండ్రులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.