Begin typing your search above and press return to search.

యువ ఎంపీ నుస్రత్ దుర్గామాతగా.. చంపేస్తామంటూ బెదిరింపులు!

By:  Tupaki Desk   |   29 Sep 2020 10:50 AM GMT
యువ ఎంపీ నుస్రత్ దుర్గామాతగా.. చంపేస్తామంటూ బెదిరింపులు!
X
పశ్చిమ బెంగాల్ కు చెందిన యువ నటి, తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ ను చంపేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపింది. దుర్గామాత అవతారంలో ఇటీవల కనిపించిన నుస్రత్ జహాన్ పై హిందూ, ముస్లిం వర్గాలు ఆగ్రహానికి గురయ్యాయి. నుస్రత్ ను చంపేస్తామని కొందరు ఆమెకు హెచ్చరికలు పంపారు. దీంతో బెంగాల్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సినీ నటి అయిన నుస్రత్ బెంగాల్ లో పాపులర్ యాక్టర్. ఈమె సీఎం మమత ప్రోద్బలంతో తృణమూల్ తరుపున నిలబడి ఎంపీగా గెలిచారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను మతాంతర వివాహం చేసుకున్నారు. సెక్యూలర్ భావాలు కలిగిన నుస్రత్ హిందూ, ముస్లిం రెండు పండుగలను జరుపుకుంటారు.

తాజాగా దుర్గాపూజ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుర్గామాతగా నుస్రత్ కనిపించడం వివాదాస్పదమైంది. ఓ వర్గం వారు ఆమెను బెదిరిస్తూ కాల్స్ చేశారు. నీ పేరు హిందువుగా మార్చుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. మా మత మనోభావాలు దెబ్బతీశావని.. నీకు మరణం ఆసన్నమైందని తాజాగా బెదిరింపులకు పాల్పడ్డారు.

ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే చాలా మంది నుస్రత్ కు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమెకు అండగా నిలుస్తున్నారు.