మీకు తెలుసా.. ఈ ఆకులు టైప్ 2 డయాబెటీస్ కు దివ్యౌషధం!

Tue May 04 2021 08:00:01 GMT+0530 (IST)

You know .. these leaves are a panacea for type 2 diabetes!

ఎన్ని మందులు వాడినా కొన్ని రోగాలను ఎదుర్కొవడం కష్టం. ఉపశమానికి మందులు వాడుతాం తప్పా వ్యాధి నివారణ ఉండదు. అందులో మధుమేహం ఒకటి. డయాబెటిస్ ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం ఎదుర్కొవాల్సిందే. అయితే ఈ వ్యాధికి ఓ ఆకు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు తేల్చారు. గుర్మార్ అనే మొక్క అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉంటుందని చెప్పారు. దాని ఆకులు వేరు కాండం వంటివి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ ఆకులో ఉండే ప్రత్యేక ఔషధ గుణాలు యాంటీ డయాబెటిక్ అథోరోస్ల్కెరోటిక్ మధమేహానికి చెక్ పడతాయని అంటున్నారు. టైప్ 2 డయాబెటిస్ రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తాయని తేల్చారు. దీనితో పాటు ఇతర వ్యాధులను ఎదుర్కొవచ్చని పేర్కొన్నారు. ఈ ఆకులను పరగడుపున తిన్న తర్వాత ఒక గ్లాసు నీరు తాగాలి. ఇది శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీని ప్రభావం రోజంతా ఉంటుంది.
 
గుర్మార్ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వును తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అంతేకాకుండా చర్మానికి అవసరమైన ప్రోటీన్లను కలిగి ఉంటుంది. చర్మంపై ఉండే తెల్లని మచ్చలను పోగొడుతుందని వైద్యులు తెలిపారు. కాంతివతంగా తయారవుతుందని వెల్లడించారు. ఇది కేవలం మధుమేహానికే కాకుండా ఇతర వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉందని చెప్పారు.
 
తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకులను కామెర్ల చికిత్స కోసం ఉపయోగిస్తారు. కంటి సమస్యలు ఉబ్బసం మలబద్ధకం అజీర్ణం వంటి ఎన్నో సమస్యలపై ఈ ఆకు పోరాడుతుందని ఆయుర్వేద నిపుముల అధ్యయనాల్లో వెల్లడైంది. మధ్య ప్రదేశ్ ఛత్తీస్గఢ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆకుతో ఎన్నో ఔషధాలు తయారు చేస్తున్నారు.