Begin typing your search above and press return to search.

బాబు యూటర్న్ ల ఎఫెక్ట్... 'ఎల్లో' కు ఎన్నెన్ని కష్టాలో?

By:  Tupaki Desk   |   28 Jan 2020 2:30 PM GMT
బాబు యూటర్న్ ల ఎఫెక్ట్... ఎల్లో కు ఎన్నెన్ని కష్టాలో?
X
నిజమే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్న్ ల పుణ్యమా అని ‘ఎల్లో మీడియా’గా పేరుపడ్డ ఆయన అనుకూల మీడియాకు ఇప్పుడు లెక్కలేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. అదేదో... చంద్రబాబు అంటే గిట్టని - ఎల్లో మీడియా అంటే గిట్టని సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయంలో జగన్ తో ఎంతమాత్ర ప్రమేయం లేకుండానే ఎల్లో మీడియా నానా కష్టాలు పడుతోంది. అది కూడా కేవలం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి కారణంగానే. నిజమే మరి... ఏదేనీ అంశంపై ఒకసారి మాట మారిస్తే - లేదంటే రెండు సార్లు మాట మారిస్తే... ఎలాగోలా సర్దుకోవచ్చు. అలా కాకుండా ప్రతిసారీ తన వైఖరిని చంద్రబాబు మార్చుకుంటూ పోతుంటే... ఆయనను - ఆయన వైఖరిని - ఆయన విజన్ ను భుజానికెత్తుకుని మోయడమంటే... ఎల్లో మీడియాకు ఏం ఖర్మ... ఎవరికైనా కష్టమే కదా.

ఈ తరమా పరిస్థితి ఎల్లో మీడియాకు ఇప్పుడు మాత్రమే వచ్చిన సమస్య కాదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా ఎల్లో మీడియా ఈ తరహా ఇబ్బందినే ఎదుర్కొంటోంది. అయితే బాబు అధికారంలో ఉండగా... అధికార పార్టీకి అనుకూల మీడియాగా ఎల్లో మీడియా ఎలాగోలా నెట్టుకొచ్చింది గానీ... ఇప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా మారిపోయారు కదా. విపక్ష నేేత నోట నుంచి వెలువడే వ్యాఖ్యలు - పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను భుజానికెత్తుకుని మోయడం ఎల్లో మీడియాకు కష్టమే కదా. ఓ అంశంపై తనది ఇదే వైఖరి అంటూ ప్రకటిస్తే.. దానిని మోయం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే అదే వైఖరిని అవసరం వచ్చిన ప్రతిసారీ మార్చుకుంటూ సాగితే... ఆ మారిన వైఖరులను మోయడం ఎల్లో మీడియాకు ఇప్పుడు తలకు మించిన భారంగానే మారిపోయింది.

మొన్నటికి మొన్న ఆంగ్ల మాధ్యమం మీద జగన్ సర్కారు దూకుడుగా సాగితే... తెలుగును చంపేస్తున్నారా? అంటూ బాబు ఓంకెలు పెట్టారు. వెంటనే ఎల్లో మీడియా కూడా తెలుగు చచ్చిపోతోందని ఓ రేంజి కథనాలు రాసింది. ఆ తర్వాత ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకం కాదని బాబు చెబితే... ఎల్లో మీడియాకు షాక్ తగిలింది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఎల్లో మీడియాకు ఇక ఆ తర్వాత వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎలా నిలువరించాలో తెలియక చంద్రబాబు సతమతమవుతుంటే... ఎల్లో మీడియా కూడా ఆయన బాటలోనే సాగుతూ... బాబు యూటర్న్ తీసుకున్న ప్రతిసారీ... ఎల్లో మీడియా కూడా తన వైఖరిని మార్చుకునేందుకు నానా యాతన పడుతోంది. తాజాగా ఏపీకి మూడు రాజధానుల విషయంలో జగన్ కు బ్రేకులేశానంటూ బీరాలు పలికిన చంద్రబాబును ఆకాశానికెత్తేసిన ఎల్లో మీడియా... ఆ వెంటనే జగన్ శాసనమండలి రద్దు చేయడంతో షాక్ తిన్నది. మండలి అవసరం లేదని గతంలో బాబే స్వయంగా చెప్పారాయే. ఇప్పుడేమో... మండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటే... బాబు దానిని వ్యతిరేకిస్తూ మాట్లాడితే...దానిని బలపరిచేలా కథనాలు వండి వార్చేందుకు నిజంగానే ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. అంతేకాకుండా ఇలా చంద్రబాబు ప్రతిసారీ తన వైఖరి మార్చుకుంటూ పోతే.. ఆయన మాదిరే మనమూ యూటర్న్ తీసుకుంటే.. జనంలో మనం పలచనబడిపోమా? అన్న భావన ఎల్లో మీడియాకు కంటి మీద కునుకు పడనీయడం లేదట.