Begin typing your search above and press return to search.

య‌న‌మ‌ల ఈ ప‌రువు న‌ష్టం కామెడీలేంటు సారూ?

By:  Tupaki Desk   |   16 Feb 2020 3:30 PM GMT
య‌న‌మ‌ల ఈ ప‌రువు న‌ష్టం కామెడీలేంటు సారూ?
X
ఏపీలో ఐటీ రైడ్స్ క‌ల‌క‌లం రేపిన వైనం గురించి హాట్ హాట్ అప్ డేట్స్ హైలెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇళ్ల‌పై జ‌రిగిన ఐటీ రైడ్స్ లో భారీ స్థాయిలో అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. ఐటీ అధికారులు కూడా ఆయ‌న ఇళ్ల‌పై సుదీర్ఘ స‌మ‌యం సోదాల‌ను నిర్వ‌హించారు. అలాగే మ‌రి కొంద‌రు తెలుగుదేశం పార్టీ నేత‌లు, లోకేష్ స‌న్నిహితుల ఇళ్ల మీద కూడా ఐటీ రైడ్స్ జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. స్థూలంగా రెండు వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం అలాంటిది ఏమీ లేద‌ని అంటోంది. ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స్పందించిన తీరు అయితే మ‌రింత ప్ర‌హ‌స‌నంలా ఉంది. ఇంత‌కీ య‌న‌మ‌ల ఏమంటారంటే.. ప‌రువు న‌ష్టం దావా వేస్తార‌ట‌! భారీ స్థాయిలో అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డిన‌ట్టుగా జ‌రుగుతున్న ప్ర‌చారం మీద తెలుగుదేశం పార్టీ ప‌రువు న‌ష్టం దావా వేస్తుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ప్ర‌ధానంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత మీడియా సంస్థ‌ల‌కు ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. సాక్షి మీడియా మీద ప‌రువు న‌ష్టం దావాను వేయ‌బోతున్న‌ట్టుగా య‌న‌మ‌ల ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య‌నే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, నారా చంద్ర‌బాబు నాయుడి త‌న‌యుడు నారా లోకేష్ సాక్షి మీద ప‌రువు న‌ష్టం దావాను వేసిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఎన్నో కోట్ల రూపాయ‌ల‌కు చిన‌బాబు ప‌రువు న‌ష్టం దావా వేశార‌ట‌. ఇక ఇప్పుడు య‌న‌మ‌ల వంతు వ‌చ్చింది.

అయినా తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు, వార్త‌ల గురించి ప‌రువు న‌ష్టందావాల గురించి మాట్లాడ‌మే విడ్డూరం. వెనుక‌టికి జ‌గ‌న్ విష‌యంలో తెలుగుదేశం పార్టీ ఎంత క‌సిగా మాట్లాడిందో ఎవ‌రికీ తెలియ‌నిది కాదు. తలా తోక లేకుండా.. ల‌క్ష కోట్లు అంటూ మొద‌లుపెట్టి, టీడీపీ అనుకూల మీడియా జ‌గ‌న్ ఇంటి గురించి కూడా విచ్చ‌ల‌విడి క‌థ‌నాల‌ను రాసింది. మ‌రి అప్పుడంతా తెలుగుదేశం పార్టీకి ఇలాంటివేమీ గుర్తుకు రాలేదు. త‌మ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి టీడీపీ ఇలా మాట్లాడుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.