చీఫ్ గెస్ట్ లు శత్రువులే..వారితో సీఎంకు సన్మానం!

Mon Feb 17 2020 12:45:23 GMT+0530 (IST)

Yadurappa Birthday Celebrations

కర్ణాటకలో రాజకీయ వైరాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇటీవలే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారని వాపోతూ ఉన్నారు కుమారస్వామి. తరచూ బహిరంగంగా ఏడ్చి తమ ఆవేదనను తెలియజేస్తూ ఉంటారు కుమార. తనపై కుట్ర చేశారని.. ఆ కుట్రకు తన పదవి బలైందని కుమారస్వామి వాపోతున్నారు సీఎం పదవి పోయాకా. ఆ కుట్ర దారులు ఎవరంటే.. జనాలకు గుర్తు వచ్చేది యడియూరప్పే. ఎందుకంటే కుమార దిగిపోగానే కర్ణాటక సీఎం సీటును పట్టేసుకున్నది ఆయనే కదా!అలాగే.. మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఈయనకూ యడియూరప్ప అంటే పడదు. అది పాత రాజకీయ వైరమే. సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు యడియూరప్ప ప్రతిపక్షం లో ఉంటూ రచ్చ చేశారు. ఆయన కాంగ్రెస్ ఈయన బీజేపీ కాబట్టి పడదు.

అలాగే యడియూరప్పకు బీజేపీలోనూ శత్రువులున్నారు. వారిలో ఒకరు సదానందగౌడ. ఒక దశలో యడియూరప్ప తను సీఎం పీఠం దిగాల్సి వచ్చింది. బీజేపీనే దించేసింది. అప్పుడు సదానందగౌడ సీఎం అయ్యారు. అలా ఆయనంటే యడియూరప్పకు కోపమే! ఇక సదానందగౌడకు మళ్లీ సీఎం కోరికలు ఉన్నా ఉండవచ్చు.

ఇదీ కర్ణాటక రాజకీయ చరిత్ర. ఈ నేథల మధ్యన వైరం. అయితే ఇప్పడు యడ్యూరప్పకు కామన్ శత్రువులు అయిన ఆ ముగ్గురు మాజీ సీఎంలూ సన్మానం చేస్తున్నారట. యడియూరప్ప 77వ పుట్టిన రోజు సందర్భం గా ముగ్గురు మాజీ సీఎంలూ ఈ ప్రజెంట్ సీఎంకు సన్మానం చేస్తారట. ఇలా కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. రాజకీయం గా ఎంత వైరి నేతలు అయినా.. వీరు ఒకే వేదిక కు తమ అందరి కామన్ శత్రువుకు సన్మానం చేయడానికి ముందుకు రావడం గొప్ప కథే!