Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రికి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన సంచిలో ఏముంది?

By:  Tupaki Desk   |   14 July 2020 12:15 PM GMT
కేంద్రమంత్రికి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన సంచిలో ఏముంది?
X
ఎవరిని ఎప్పుడేం అడగాలన్న విషయంలో టీడీపీ అధినేత.. ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు చాలానే తప్పులు చేశారన్న భావన కలుగక మానదు. కీలక విషయాల్ని ప్రస్తావించి.. రాష్ట్రానికి మేలు చేయించుకునే విషయంలో ఆయన అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే.. మరి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినట్లు? అన్న సందేహం కలుగక మానదు. ఇంతకూ జరిగిందేమంటే?

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. మర్యాదపూర్వక భేటీలో ఆయన ఒక ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. తమ భేటీలో భాగంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని నిర్మలమ్మ చేతికి సంచి రూపంలో ఇచ్చిన ఆయన.. టీటీడీ ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

పెద్ద నోట్లరద్దు తర్వాత తిరుమల శ్రీవారి హుండీలో పాతనోట్లు పెద్ద ఎత్తున కానుకగా వేస్తున్నారు.ఇప్పటివరకూ టీటీడీ వద్ద అలాంటి నోట్ల విలువ ఏకంగా రూ.50 కోట్ల వరకు ఉంటాయి. తమ వద్ద పెద్ద మొత్తంలో పేరుకున్న పాతనోట్లను మార్పిడి చేయాలని కోరారు. టీటీడీ వద్ద ఉన్న మొత్తాన్ని కేంద్రం తీసుకొని.. దానికి బదులుగా మొత్తాన్ని టీటీడీకి అందజేస్తే.. పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన నాలుగేళ్ల తర్వాత ఇంత భారీ మొత్తం గురించి కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకురావటం బాగానే ఉన్నా.. అంతకు ముందున్న సర్కారు ఏం చేస్తున్నట్లు? అన్న సందేహం రాక మానదు. తనను కలిసిన టీటీడీ ఛైర్మన్ వైవీ కోరిన కోరిక మీద నిర్మలమ్మ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.