82 వేల మెజారిటీ... బోసిపోయిన ప్రజాగ్రహ దీక్ష

Fri Oct 22 2021 18:00:02 GMT+0530 (IST)

YSRCP Prajagraha Deeksha

వైసీపీ అధినేత జగన్ తర్వాత.. దాదాపు ఆ రేంజ్‌లో గత ఎన్నికల్లో మెజారిటీ తెచ్చుకున్న నియోజకవర్గం గిద్దలూరు. దాదాపు 82 వేల మెజారిటీతో ఇక్కడ వైసీపీ విజయ దుందుభి మోగించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజ కవర్గం ఇంత ఘన కీర్తిని దక్కించుకుంది. అయినప్పటికీ.. ఏం ప్రయోజనం అనే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇంత భారీగా మెజారిటీ ఉన్నప్పటికీ వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేపట్టినా.. ఇక్కడ పట్టుమని పది మంది కూడా నాయకులు కనిపించడం లేదు. సక్సెస్ అనే మాటే వినిపించడం లేదు.మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు అంటే.. ఇక్కడ నిజమైన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రాధాన్యం లేదు. కేవలం పదవుల కోసం.. ఎన్నికలకకు ముందు.. తర్వాత.. వచ్చి చేరిన వారికే ప్రాధాన్యం ఉంటోం ది. వారికే .. పదువులు  వస్తున్నాయి. కాంట్రాక్టులు దక్కుతున్నాయి. అంతేతప్ప ఆది నుంచి పార్టీలో ఉన్నవారికి కనీసం సర్పంచ్ పదవులు కూడా దక్కడం లేదు. నిజమైన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మొండి చేయే మిగులుతోంది. దీంతో నిజమైన వైసీపీ నాయకులకు కార్యకర్తలు కుమిలిపోతున్నారు. ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా. స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

ఏ కార్యక్రమం చేసినా.. పట్టుమని పది మంది కూడా హాజరు కాని పరిస్థితి ఉంది. ఉదాహరణకు తాజాగా వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్ష.. ఇక్కడ గిద్దలూరులోనూ జరిగింది. భారీ ఎత్తున టెంట్లు వేశారు. పెద్ద ఎత్తున కుర్చీలు వేశారు. కానీ ఏం లాభం అన్ని కుర్చీలు.. బోసిపోతున్నాయి. ఎవరూ రాలేదు. ఎలాంటి సందడీ లేదు. వచ్చిన అతి కొద్ది మంది కూడా ఎవరికివారు తమ చేతుల్లో సెల్ ఫోన్లు చూసుకుంటూ.. కాలక్షేపం చేశారు. ఇదే విషయం.. ఫొటోలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గగమనార్హం.

దీంతో నెటిజన్లు.. ఇది జనాగ్రహ మీటింగ్ కాదేమో.. జన కరువు దీక్ష అయి ఉంటుంది..అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ అధ్యక్షుడు.. సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో తెచ్చుకున్న మెజారిటీకి దాదాపు అటు ఇటుగా భారీ మెజారిటీ సాధించిన నియోజకవర్గం గిద్దలూరు.  మరి ఇంత భారీగా ఇక్కడి ప్రజలు వైసీపీని నెత్తిన పెట్టుకుంటే.. ఇప్పుడు ఎందుకు.. సహకరించడం లేదు? జగన్‌ను అభిమానించేవాళ్లు.. వీరిలో ఉన్నారా? అని ఇక్కడి స్థానిక నేతలను అడిగితే.. ఆసక్తికర సమాధానం వస్తోంది.

మాకేమైనా పార్టీలో ప్రధాన్యం ఉందా?  అంటున్నారు. అంతేకాదు.. తాము పదేళ్ల నుంచి పార్టీలో ఉన్నామ ని.. నిజమైన కార్యకర్తల్లా జెండా భుజాన వేసుకుని జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని  చేసేందుకు.. ఇల్లి ల్లూ తిరిగామని.. అయితే.. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదని ..ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో తాము ఎందుకు పాల్గొనాలి? అని వారు ప్రశ్నిస్తున్నారు. బూత్ స్థాయి నాయకులు లేరు. సో.. ఇలా ఉంది.. నిజమైన వైసీపీ కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి. చూద్దాం.. మరి అధిష్టానం ఆలోచన ఎలా ఉందో. నిజమైన వాళ్లకు న్యాయం చేస్తుందో.. లేదో.. అని అంటున్నారు.  

మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే.. కామెంట్స్ రూపంలో పెట్టండి.. మేం ప్రచురిస్తాం. మీకు నచ్చితే లైక్ కొట్టండి.. షేర్ చేయండి.