క్రేజంటే గోరంట్లదే...వీడియో మహిమ

Sun Aug 14 2022 21:37:45 GMT+0530 (IST)

YSRCP MP Gorantla Madhav

ఆయన వైసీపీఎ ఎంపీ అధికార పార్టీ దర్జా అంతా ఉంది. మూడేళ్ళు పై దాడి హిందూపురం ఎంపీగా ఉన్నారు. అయినా సరే పెద్దగా మీడియాలో అయితే ఏ విధానా  ఫోకస్ అయితే కాలేదు. ఇక ఆయన పనితీరు అయితే ఏమన్నది సొంత నియోజకవర్గం ప్రజలే చెప్పాలి. ఇదిలా ఉంటే మాధవ్ కి ఇంత క్రేజ్ ఉందా అని అంతా ఆశ్చర్యంతో కనుబొమ్మలు చిట్లించేలా ఢిల్లీ టూ  కర్నూలు వచ్చిన ఆయనకు స్వాగతం లభించింది.ఆయన సొంత సామాజికవర్గం కురుబ కులస్తులు ఎంపీగారికి కర్నూల్ లో స్వాగతం పలికారు. అలాగే వైసీపీ నాయుకులు కార్యకర్తలు కూడా మాధవ్ కి గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఇక మాధవ్ అభిమానులు కోలాహలం అయితే ఒక్క లెక్కన ఉంది.

చిత్రమేంటి అంటే మాధవ్ స్వాగత ర్యాలీకి పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. కానీ ఆయన అధికార పార్టీ ఎంపీ. దాంతో భారీ ర్యాలీ తీసి మా ఎంపీ మా మాధవ్ అంటూ వైసీపీ వారంతా ఆర్భాటం చాటుకున్నారు. మరో వైపు టీడీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేసి మరీ అధికార భక్తిని చాటుకున్నారు అన్న విమర్శలు వచ్చాయి

ఇక మాధవ్ పేరిట సోషల్ మీడియాలో చలామణీలో ఉన్న ఒక న్యూడ్ వీడియోతో ఆయన ఒక్కసారిగా ఫోకస్ అయిపోయారు. మంచికో చెడ్డకో మీడియా అంతా మాధవ్ నే తలుస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే కలవరిస్తోంది. ఇక విపక్ష తెలుగుదేశం పార్టీ అయితే మాధవ్ ని టార్గెట్ చేసింది.

దాంతో ఏపీలో చూస్తే గత పదిరోజులుగా మాధవ్ నామస్మరణ తప్పితే మరేమీ లేదు. ఇవన్నీ కలసి మాధవ్ కి ఈ క్రేజ్ ని తెచ్చేశాయా అన్నట్లుగా ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. మొత్తానికి రాజకీయాల్లో ఎటు నుంచి ఎటు తిప్పినా నాయకుల క్రేజ్ కి ఢోకా లేదనడానికి మాధవ్ లేటెస్ట్ గ్రాండ్ వెల్ కమ్ ఎపిసోడ్ రుజువు చేసింది.