Begin typing your search above and press return to search.

పధకాలు రావాలంటే సొంత పెళ్ళాం కూడా ...?

By:  Tupaki Desk   |   15 Aug 2022 4:17 AM GMT
పధకాలు రావాలంటే సొంత పెళ్ళాం కూడా ...?
X
సంక్షేమ పధకాలు కాదు కానీ సర్కార్ వారు పెడుతున్న అర్హతలు చూసి లబ్దిదారులు విసిగిపోతున్నారు. ఒక దశలో ఏమిటి ఈ సవాలక్ష షరతులు అని కూడా మండుతున్నారు. ఇంట్లో ఉద్యోగం చేస్తున్న వారు ఉంటే తెల్ల కార్డు కట్ అంటారు. కానీ ఆ ఉద్యోగం చేసే అ బిడ్డలు తల్లిదండ్రుల వద్ద ఉండరు. అలాగే సొంతంగా ఇల్లు ఉంటే రేషన్ కట్ అంటారు.

ఈ రోజుల్లో యాభై గజాల స్థలంలో ఏదో ఇల్లు కట్టుకుని బతుకుతున్న వారంతా జమీందార్లు అని లెక్కలు వేస్తే ఎలా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సొంత బండి ఉండకూడదు, కారు ఉండరాదు అంటారే చివరికి సొంత పెళ్లాం కూడా ఉండకూడదాండీ. ఇదీ జనాలకు పెద్ద డౌట్.

మరి ఆ డౌట్ మనలో ఉంచుకోవడం ఎందుకు ఏకంగా మన వద్దకు వస్తున్న ఎమ్మెల్యేనే అడిగేస్తే పోలా అనుకున్నాడో ఏమో కానీ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ముస్లిం మైనారిటీకి చెందిన ఒక వ్యక్తి ఇదే విషయాన‌ నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాంత్ రెడ్డికి ఈ విచిత్రమైన ప్రశ్న వేసి అవాక్కయ్యేలా చేశాడా పెద్ద మనిషి.

అయ్యా పధకాల కోసం ఇన్ని రకాల ఆంక్షలు పెడుతున్నారు. ఇలా ఇన్ని షరతులు మ్యానిఫేస్టోలో ముందే ఎందుకు పెట్టలేదు అంటూ శ్రీకాంత్ రెడ్డిని రెట్టించి మరీ అడిగారు. నీకు ఏ ఒక్క పధకం అందలేదా అని శ్రీకాంత్ రెడ్డి అడిగితే ఏదీ అందలేదని బదులిచ్చాడు. అయితే నా దగ్గరకు రా అంటూ శ్రీకాంత్ రెడ్డి చెప్పగా మీ దగ్గరకు వస్తే ఏమి లాభమని ఎదురు ప్రశ్నించడంతో
ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.

ప్రజా సేవకులు మీరు మా విషయాలు వినాలంటూ అక్కడ ఉన్న వారంతా ఎమ్మెల్యేను నిలదీయడంతో శ్రీకాంత్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మొత్తానికి ఆ ముస్లిం మైనారిటీ వ్యక్తి మాటలను సెటైరికల్ గా బదులిస్తూ ఎమ్మెల్యే ఈసారి మ్యానిఫేస్టోలో అన్నీ పెట్టిస్తాలే నీ కోసం అంటూ చెప్పి వెళ్ళిపోయారు. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ మ్యానిఫేస్టోలో ఏముంటుంది అన్నదే ఇపుడు చర్చ మరి. సొంత పెళ్ళాం ఉంటే సంక్షేమ‌ పధకం ఇవ్వమని కొంపదీసి పెడతారా ఏంది అని కూడా సెటైర్లు పడుతున్నాయట.