Begin typing your search above and press return to search.

మొన్న డిప్యూటీ సీఎం ..నేడు ఎమ్మెల్యే ... ఏపీలో అసలేం ఏం జరుగుతోంది ..?

By:  Tupaki Desk   |   8 Nov 2019 12:41 PM GMT
మొన్న డిప్యూటీ సీఎం ..నేడు ఎమ్మెల్యే ... ఏపీలో అసలేం ఏం జరుగుతోంది ..?
X
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీ తో గెలిచి అధికారాన్ని చేపట్టింది. ఆ తరువాత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్దే ద్యేయంగా సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ , రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం ఏమాత్రం బాగాలేదు అని అనిపిస్తుంది. ప్రభుత్వ అధికారుల పై ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదు చేసారు అంటే .. ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్నారు అని చెప్పవచ్చు. మాములుగా ఎక్కడైనా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

కానీ , ఏపీలో మాత్రం దీనికి రివర్స్ లో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ప్రభుత్వ అధికారుల పై పాలక పక్షం వారే ఫిర్యాదులు చేయడం ఇప్పుడు ఆస్తకిగా మారింది. గతవారంలో ఏసీబీ అధికారుల తీరు పై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ వాళ్లు దోపిడీ దొంగలకంటే దారుణంగా ఉన్నారని.. ఏకంగా హోంమంత్రికే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ ఘటన నుండి తేరుకోకముందే విజయనగరం జిల్లా సాలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర ప్రభుత్వ అధికారుల తీరుపై మంత్రులకి ఫిర్యాదు చేసారు.

ఆరు నెలలుగా తనకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, విజయనగరం కలెక్టరేట్‌ లో జిల్లా సమీక్ష సమావేశంలో ఫిర్యాదు చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన తనను అధికారులు ఇబ్బందిపెట్టారని.. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే రాజన్నదొర ప్రశ్నించారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ ముందే తన ఆవేదనను వ్యక్తం చేశారు రాజన్న దొర చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా ప్రభుత్వ అధికారుల పై ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ తరువాత మంత్రులు రాజన్న దొరకి ఈ విషయంలో సర్ది చెప్పారు.