మార్పు తప్పదు గురూ.. సలహాదారు ఫోన్‌తో ఎమ్మెల్యే జంప్..!

Sun Sep 25 2022 14:08:23 GMT+0530 (India Standard Time)

YSRCP Leaders In Andhrapradesh

అధికార పార్టీ వైసీపీలో టికెట్ల వేట ప్రారంభమైంది. ఎక్కడిక్కడ నాయకులు.. బెంబేలెత్తుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ల విషయాన్ని అధిష్టానం.. డోలాయమానంలో పడేసింది. పనిచేసేవారికే టికెట్లు ఇస్తామని చెబుతోంది. అయితే.. పనిచేస్తున్నా.. కూడా తమకు గ్యారెంటీ లేదని.. చాలా మంది నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో పార్టీ సలహాదారులను వారు ప్రశ్నిస్తున్నారు. సార్.. మేం పనిచేస్తున్నాం..వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ చేయరూ.. అని వారు అభ్యర్థిస్తున్నారు.ఇలా.. రోజూ రెండు మూడు నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యాలయానికి ఫోన్లు వస్తున్నాయని.. తాడే పల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీమకు చెందిన యువ నాయకుడు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆరితేరిన.. ఎమ్మెల్యే.. ఒకరు తాజాగా తాడేపల్లి కి ఫోన్ చేసి.. తన నియోజకవర్గంలో తాను చేస్తున్న కార్యక్రమాలను వివరించారట. అంతేకాదు.. ఒక సీడీని కూడా పార్టీ కార్యాలయానికి పంపించారట.సర్ నేను అద్భుతంగా పనిచేస్తున్నాను. నాకు టికెట్ కన్ఫర్మ్ చేయాలని.. కోరారట.

అయితే.. ఒకకీలక సలహాదారు మాత్రం.. సదరు ఎమ్మెల్యేపై ఉన్న ఆరోపణల చిట్టాను విప్పారట. సొంత పార్టీ నేతలనే నువ్వు పట్టించుకోవడం.. లేదు. నీకు టికెట్ ఇస్తే.. టీడీపీ వాళ్లు కాదు.. ముందు మన పార్టీ వాళ్లే ఓడించేస్తారని.. తెలుస్తోంది. ముందు దానిని సరిచేసుకో.. అని సూచించారట. అయితే.. ఆయన మాత్రం అలా ఏంలేదు సార్.. నేనంటే.. గిట్టని కొందరు అలా ప్రచారం చేస్తున్నారని చెప్పారట. దీంతో ఒకింత సీరియస్ అయినా.. సదరు సలహాదారు.. పార్టీ చేయించిన సర్వేలోనూ.. మైనస్ మార్కులు పడ్డాయని చెప్పారట.

మార్పు తప్పదు గురూ.. నువ్వు మారాలి. లేకపోతే.. నిన్ను మార్చేస్తాం.. అని గట్టిగానే చెప్పారట. తదీంతో సదరు ఎమ్మెల్యే కి ఇప్పుడు ఏం చేయాలతో తెలియడం లేదు. వైసీపీ టికెట్  ఇవ్వకపోతే.. ఇతర పార్టీలు ఏవీ కూడా ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్తితి లేదు. దీంతో నాయకులను కలుపుకొని వెళ్లడమా.. లేక ఇంకేమైనా చేయొచ్చా.. అని అంతర్మథనంలో మునిగిపోయారట. ఇదీ.. సంగతి.. !