Begin typing your search above and press return to search.

ఔట్ డేటెడ్ నేతల కామెంట్లతో ప్రయోజనం ఎంత?

By:  Tupaki Desk   |   13 April 2019 4:43 PM GMT
ఔట్ డేటెడ్ నేతల కామెంట్లతో ప్రయోజనం ఎంత?
X
ఈ ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు ఔట్ డేటెడ్ నేతలు చేరారు. వారేమీ ప్రజాబలం ఉన్న వారు కాదు. గతంలో వివిధ సమీకరణాల మధ్యన కాస్త హడావుడి చేసిన వారు వీరంతా. ప్రత్యక్ష ఎన్నికల్లో వీరు సత్తా చాటి చాలా కాలం అయ్యింది - మరి కొందరు అయితే ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో రాణించింది లేదు. అలాంటి వారు కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎన్నికల ముందు కాబట్టి వారు వచ్చి చేరతామంటే జగన్ కాదనలేకపోయారు. చేర్చుకున్నారు. అయితే వారికి టికెట్లు ఇచ్చేంత సాహసం ఏదీ చేయలేదు జగన్ మోహన్ రెడ్డి.

రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు వంటి వారు ఈ కేటగిరిలోకే వస్తారని పరిశీలకులు అంటూ ఉన్నారు. అదే జాబితాలో కొణతాల రామకృష్ణ కూడా ఉన్నా.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయారు. జగన్ ను కలిసిన తర్వాత వెళ్లి మళ్లీ తెలుగుదేశం పార్టీకి తన మద్దతు అన్నారు. తద్వారా తన తీరేమిటో చాటి చెప్పుకున్నారాయన.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఔట్ డేటెడ్ పొలిటీషియన్లు ఇప్పుడు తమ దైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీరి మాటలు కొన్ని మరీ అసంబంద్ధంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీరు ఇప్పుడు ఇలా స్పందిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనవసరమైన నష్టం చేస్తున్నారా.. అనే సందేహాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.

పోలింగ్ పూర్తి అయ్యాకా ఇప్పుడు ఎవరు ఏం కామెంట్లు చేసినా యూజ్ లేదు. అలాగని కామ్ గా ఉండిపోనక్కర్లేదు. మాట్లాడే మాటలు కాస్త సంబద్ధంగా ఉంటే చాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.