Begin typing your search above and press return to search.

హిందూపురం వైసీపీ ర‌గ‌డ‌కు రీజ‌నేంటి..?

By:  Tupaki Desk   |   27 Jun 2022 2:30 AM GMT
హిందూపురం వైసీపీ ర‌గ‌డ‌కు రీజ‌నేంటి..?
X
అత్యంత కీల‌క‌మైన శ్రీస‌త్యసాయి జిల్లాలోని హిందూపురంలో వైసీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డుతున్నా యి. ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిపోయిన‌మాజీ పోలీసు అధికారి .. మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. నెత్తిన పెట్టుకున్నారు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. మ‌రి ఇన్ని హామీలు ఇచ్చిన‌ప్పుడు ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఎలా ముందుకు సాగాలి? అనేది ఇంపార్టెంట్ విష‌యం.

పార్టీని అన్ని కోణాల్లోనూ ఆయ‌న బ‌లోపేతం చేయాలి. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోవాలి. ప్ర‌తి విష‌యం లోనూ.. నేనున్నానంటూ.. నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా నింపాలి. కానీ, ఆయ‌న అలా చేయ‌డం లేద నే వాద‌న వినిపిస్తోంది. తాజాగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ కులు బ‌హిరంగ చ‌ర్చ‌కు రావ‌డం.. ప్రెస్‌మీట్ పెట్ట‌డం.. వంటివి ఆస‌క్తిగా మారుతున్నాయి. అదేసమ యంలో వైసీపీలో వివాదాల‌ను తెర‌మీదికి తెచ్చాయి.

ఇక్క‌డ నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్న న‌వీన్ నిశ్చ‌ల్ వ‌ర్గంగా ఉన్న‌వారిని ఇక్బాల్‌.. త‌న‌వైపు తిప్పుకోవ డంలో విఫ‌ల‌మ‌య్యారు. అంతేకాదు.. వీరికి అన్ని విధాలా ఆయ‌న అడ్డు త‌గులుతున్నార‌నేది వాస్త‌వం. సొంత పార్టీ నేత‌లు త‌న వర్గంకార‌ని తెలియ‌డంతో వారిపై కేసులు పెట్టించ‌డంతోపాటు.. వేధింపుల‌కు కూడా గురి చేస్తున్నారు. ముఖ్యంగా న‌వీన్ నిశ్చ‌ల్‌కు ఇక్క‌డ ద‌ళిత సామాజిక వ‌ర్గం అండ‌గా ఉంది. ద‌ళితుల ఓటు బ్యాంకు ఎంత ఉంద‌నేది ప‌క్క‌న పెడితే.. వారి అండ మాత్రం వైసీపీకి ఉంది.

వీరి విష‌యంలోనే ఇక్బాల్ మొండి వైఖ‌రిని అవ‌లంబిస్తున్నారు. ద‌ళితుల‌ను ఆయ‌న చేరదీయ‌క‌పోగా.. వారి స‌మ‌స్య‌ల‌ను కూడా వినిపించుకోవ‌డం లేదు. దాడులు కూడా చేయిస్తున్నార‌ని.. ద‌ళిత వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక్బాల్‌కు టికెట్ ఇవ్వ‌వ‌ద్ద‌ని.. తాజాగా ద‌ళిత సంఘాల నాయ‌కులు కూడా తీర్మానం చేశారు. ఈ విష‌యంపైనే ఇప్పుడు ఇక్బాల్‌కుద‌ళితుల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధంగా జ‌రుగుతోంది. మ‌రి దీనిని వైసీపీ అదిష్టానం ఎలా స‌రిదిద్దుతుందో చూడాలి.