Begin typing your search above and press return to search.

కుట్ర కోణం : వైసీపీలో ఏం జరుగుతోంది...తెలియాల్సిందే

By:  Tupaki Desk   |   28 Jun 2022 12:30 PM GMT
కుట్ర కోణం : వైసీపీలో ఏం జరుగుతోంది...తెలియాల్సిందే
X
వైసీపీలో ఏపీలో టీడీపీకి ధీటైన పార్టీగా ఎదిగింది. షార్ట్ టైమ్ లోనే పవర్ ఫుల్ పార్టీగా మారింది. 2011లో పార్టీని జగన్ స్థాపిస్తే ఈ రోజు వరకూ గ్రాఫ్ అలా పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఇక 2024 నాటికి వైసీపీ సీన్ ఏంటి అన్నది చూడాలి. ఇదిలా ఉంటే వైసీపీలో మూడేళ్ల పాలన పూర్తి అయిన తరువాత చాలా రాజకీయ  తమాషాలు పార్టీలోపలనే  జరుగుతున్నాయి.

ఎన్నడూ ఊహించని గొంతులు అసమ్మతి స్వరాలు వినిపించాయి. చెల్లెమ్మా అని జగన్ స్వయాన  దగ్గరకు తీసిన వారే అలకపూని రచ్చ చేశారు. ఇక చాలా మంది మీడియా పులుల్లా నాడు గర్జించి నేడు సైలెంట్ అయ్యారు. మొత్తంగా చూస్తే వైసీపీలో చాలానే  జరుగుతోంది. అంతా బాగుంది అని పైకి కనిపిస్తున్నా చాలా మంది ఎమ్మెల్యేలు లోలోపల కుతకుతలాడుతున్నారు. కొందరు అయితే సన్నిహితుల ముందు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు అని కూడా తెలుస్తోంది.

ఇక లేటెస్ట్ గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే బాంబు లాంటి వార్తను పేల్చారు. వైసీపీలో కొంతమంది నేతలు తన మీద కుట్ర చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. బాలినేని చెప్పిన ఈ మాటలను ఆషామాషీగా తీసుకోవడానికి వీలులేదు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అంతే కాదు, వైసీపీ పునాదుల నుంచి ఉన్న నేత. అంతకు మించి జగన్ కి దగ్గర బంధువు.

అలాంటి నేత తన మీదనే కుట్రలు జరుగుతున్నాయి అని అంటున్నారు అంటే చాలా చాలా విషయాలు ఆలోచించాలి.  బాలినేని లాంటి వారిని తేరిపారా చూసే ధైర్యం సొంత పార్టీలో ఎక్కువమందికి ఉండదు. కానీ ఆయన తాను బలి అవుతున్నాను, తనను ముందు పెట్టి కుట్ర రాజకీయాలు వైసీపీ నేతలే  చేస్తున్నారు అని వాపోతున్నారు అంటే ఇది కచ్చితంగా సీరియస్ ఆరోపణ. పైగా ఆయన మీడియా ముందుకు వచ్చి మరీ మండిపడ్డారు. దాంతో హై కమాండ్ ఏన్ చేస్తోంది, అసలు ఏం చేయాలి అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఇది ఒక్క బాలినేని సమస్య అయితే కాదు అనే అంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఇపుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన వెనక కుట్ర జరుగుతోంది అని మాట్లాడుతున్నారు. అయితే ఆయన కుట్ర చేస్తున్నది ఎవరో డైరెక్ట్ గా చెప్పకపోయినా మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా విరుచుకుపడ్డారు. ప్రస్తుతానికి ఆనం వైసీపీలో ఉన్నా ఆయన రూటే సెపరేట్ అన్న మాట వినిపిస్తున్న సంగతి విధితమే.

దాంతో కోటం రెడ్డి విషయంలో ఆనం కుట్రలు ఉన్నాయా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఈ రెండు ఇపుడు వైసీపీలో హాట్ టాపిక్స్ గా ఉండగా ఇప్పటికే గన్నవరం, మచిలీపట్నం వైసీపీలలో వివాదాలు బాహాటం అయ్యాయి. అలా నేతలు రోడ్డున పడ్డారు. పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. చూడబోతే కాంగ్రెస్ కల్చర్ ఏదో వైసీపీని ఆవహించినట్లుగా కనిపిస్తోంది.

అదే టైమ్ లో జగన్ లాంటి బలమైన అధినేత కళ్ళ ఎదురుగా  ఉండగానే నోరు విప్పి మీడియాలకు ఎక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకనాడు ఎంత పెద్ద నేత అయినా వైసీపీలో  బయటకు వచ్చి మాట్లాడానికి జంకే సీన్ ఉండేది. ఇపుడు ఓపెన్ గా మీడియాను ఫేస్ చేస్తున్నారు అంటే జగన్   గ్రిప్ పార్టీ మీద సడలిందా అన్న చర్చ కూడా వస్తోది. ఇక కుట్రలు పార్టీలో జరుగుతున్నాయి అంటే దీని మీద హై కమాండ్ కూడా సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు. లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అవుతుంది అని అంటున్నారు.